Wednesday, May 1, 2024

ఒలింపిక్స్ వాయిదా వేయాల్సిందే

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: జపాన్ రాజధాని టోక్యోలో ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలను ఏడాది పాటు వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘాన్ని కోరారు. కరోనా వ్యాధి ప్రపంచాన్ని కుదిపేస్తున్న ప్రస్తుత తరుణంలో ఒలింపిక్స్ వంటి మెగా క్రీడలను నిర్వహించడం మంచిది కాదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. కనీసం ఏడాది వరకు ఈ క్రీడలను తప్పని సరిగా వాయిదా వేయాలని సూచించారు. ఈ క్రీడల్లో వేలాది మంది క్రీడాకారులు పాల్గొంటారని, ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడం దాదాపు అసాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది జులైలో టోక్యో వేదికగా ఒలింపిక్స్ క్రీడలు జరగాల్సి ఉంది. కరోనా వ్యాధి నేపథ్యంలో ఈ మెగా క్రీడలు కొనసాగడం కష్టంగా కనిపిస్తోంది. తాజాగా ట్రంప్ ఒలింపిక్స్ క్రీడలను వాయిదా వేయాలని కోరడంతో ఈ మెగా క్రీడా సంగ్రామం భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

Trump Suggests Summer Olympics could be postponed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News