Monday, April 29, 2024

ట్రంప్ చిన్నకొడుకుకు కరోనా..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్అ:మెరికా అధ్యక్షులు ట్రంప్ చిన్న కుమారుడు 14 ఏండ్ల బారన్ ట్రంప్‌నకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ఈ విషయాన్ని దేశ ప్రథమ పౌరురాలు, ట్రంప్‌భార్య మెలానియా ట్రంప్ తమ బ్లాగ్ ద్వారా తెలిపారు. తల్లిదండ్రులిద్దరికి ఇటీవలే కరోనా వచ్చింది. ఈ క్రమంలో వారి ద్వారా జూనియర్ ట్రంప్ కూడా వైరస్ బారిన పడ్డారు. వైట్‌హౌస్ వెబ్‌సైట్‌లో పోస్టు చేసిన బ్లాగ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తాను కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు, ఎన్నికల ప్రచారానికి అన్ని విధాలుగా రెడీగా ఉన్నానని ఇటీవలే ట్రంప్ ప్రకటించారు. ప్రెసిడెంట్ అత్యంత సన్నిహితుడు హోప్ హిక్స్‌కు వైరస్ తొలుత సోకింది. తరువాత సరైన జాగ్రత్తలను పట్టించుకోకుండా ఉండే ట్రంప్ ఆయన భార్య వైరస్‌కు గురయ్యారు. బెర్రాన్‌కు కూడా కరోనా వచ్చిందనే తాను కొద్ది రోజులుగా ఆందోళన చెందుతూ వస్తున్నానని, తిరిగి జరిపిన పరీక్షలో ఇది నిజమని తేలిందని , ఇప్పుడు తాము కరోనా నుంచి కోలుకున్నందున ఆయన ఆరోగ్య చికిత్స గురించి తగు శ్రద్ధ తీసుకునేందుకు వీలవుతుందని మెలానియా తెలిపారు. టీనేజ్ బారన్‌కు కరోనా లక్షణాలు అంతగా బాధించలేదని, ఆయన చురుగ్గానే ఉన్నారని ఫస్ట్‌లేడీ వివరించారు.
విటమిన్లు, పౌష్టికాహారంతో మేలు: మెలానియా
కరోనాకు ముందు తనకు బాగా ఒళ్లు నొప్పి, దగ్గు, తలనొప్పి వంటి లక్షణాలు చోటుచేసుకున్నాయని, పూర్తిగా అలసటకు గురయ్యానని మెలానియా తెలిపారు. వైరస్ సోకిందని తెలియగానే తాను ఎక్కువగా విటమిన్లు, ప్రకృతిసిద్ధమైన మందులు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నానని వివరించారు. ఎప్పుడూ సరైన సంరక్షకులు ఉండటంతో తమకు తొందరగా వైరస్ నయం అయిందన్నారు. ఇందుకు తాము సిబ్బందికి ఎప్పుడూ రుణపడి ఉంటామన్నారు. డాక్టర్ కోన్లీ ఆయన బృందం తమ వృత్తిపరమైన అనుభవంతో అందించిన వైద్య సేవలు ఎంతగానో ఉపకరించాయని వెల్లడించారు. ట్రంప్ దంపతులు కోలుకున్నప్పటికీ చిన్న కుమారుడికి వైరస్ సోకడం, వైట్‌హౌస్ సిబ్బందిలో కూడా కొందరు వైరస్‌కు గురికావడంతో దేశంలో కరోనా తీవ్రత ఏ స్థితిలో ఉందనేది తెలుస్తూనే ఉందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Trump’s younger son tests positive for corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News