Monday, April 29, 2024

ఎపి డేటా ఇంజనీరు వెంకట్ దుశ్చర్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : పారిస్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన అంతర్జాతీయ విమానాశ్రయంలో అడ్డగోలుగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కస్టడీకి వెళ్లాడు. ఎపికి చెందిన 29 సంవత్సరాల డేటా ఇంజనీరు వెంకట్ మోహిత్ ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో పారిస్ నుంచి వస్తూ ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నించాడు. దీనిని గుర్తించిన సిబ్బంది ఈ ప్రయాణికుడు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు విమానం చేరగానే కస్టడీకి అప్పగించారు. ఈ నెల 15న వెంకట్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. సాధారణంగా అత్యవసర ద్వారాన్నికేవలం అత్యయిక స్థితిలోనే వాడాల్సి ఉంటుంది.

దీనిని పట్టించుకోకుండా ఈ వ్యక్తి ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచేందుకు యత్నించి , ఇతర ప్రయాణికుల భద్రతను పట్టించుకోని రీతిలో వ్యవహరించినట్లు ఎయిర్ ఫ్రాన్స్ ఉద్యోగి ఒక్కరు ఫిర్యాదు చేయడంతో బెంగళూరులో దిగగానే పోలీసులు అరెస్టు చేసిన వెంకట్ తరువాత బెయిల్ పొందాడు. విమానం ఎక్కి సాగుతున్న దశలో ఈ వ్యక్తి ఎమర్జెన్సీ డోర్ సరిగ్గా పనిచేస్తుందా? లేదా అనేది తనకు తానుగా తనిఖీ చేసుకునేందుకు ఈ చేయరాని పని చేసినట్లు పోలీసులకు అందిన ఫిర్యాదులో తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News