Saturday, April 27, 2024

111 జిఒను ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 111 జిఒను పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ జిఒ ఎత్తివేయాలని 84 గ్రామాల ప్రజలు ఎంతోకాలంగా విజ్ఞప్తి చేస్తున్నారని పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లో 111 జిఒను ఎత్తివేస్తామని సిఎం హామీ ఇచ్చారని, 111 జిఒను ఎత్తివేసి సిఎం కెసిఆర్ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని హరీశ్‌రావు తెలిపారు.

ఈ జిఒ పరిధిలో ఉన్న 84 గ్రామాల ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉన్నామని ఎన్నో ఏళ్లుగా ఆందోళన చెందుతున్నారని, దీనిపై స్పందించిన సిఎం 84 గ్రామాలకు మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. హెచ్‌ఎండిఎ పరిధిలో ఉన్న గ్రామాలకు ఎలాంటి విధి విధానాలు అమలులో ఉంటాయో, 111 జిఒ పరిధిలోని గ్రామాలకు కూడా అవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. గోదావరి నీళ్లతో హిమాయత్ సాగర్, గండిపేటను నింపుతామని తెలిపారు. కాళేశ్వరం జలాలతో హిమాయత్ సాగర్, గండిపేట, హుస్సేన్ సాగర్‌ను అనుసంధానిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News