Friday, May 10, 2024

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

Accident

మనతెలంగాణ,హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతిచెందిన సంఘటన నగరంలో గురువారం చోటుచేసుకుంది. లాక్‌డౌన్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ మురళికృష్ణ ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా సడన్‌గా కుక్క అడ్డురావడంతో బ్రేకులు వెశాడు. దీంతో కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పోలీసులు మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కానిస్టేబుల్ హెల్మెట్ పెట్టుకోకపోవడంతో గాయాలయ్యాయి. నాలుగు రోజుల క్రితం కుక్క అడ్డు రావడంతో హోంగార్డు మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎడిసిపి శ్రీనివాస్ రెడ్డి కోరారు.

TS Cop dead in Road Accident in Hyderabad

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News