Monday, April 29, 2024

వనస్థలిపురంలో ఒకే కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్..

- Advertisement -
- Advertisement -

Corona positive

మన తెలంగాణ,హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా వనస్థలిపురం ఏ క్వార్టర్స్‌లో ఒకే ఇంటిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడం, అందులో ఒకరు మృతిచెందడంతో స్దానికంగా కలకల రేగింది. దీంతో అధికారులు కరోనా వచ్చిన ఇంటి పరిసరాలను రెడ్‌జోన్‌గా ప్రకటించి ఆప్రాంతంలో ఎవరూ సంచరించకుండా లాక్‌డౌన్ పకడ్బందీ చేస్తున్నారు. అధికారులు వివరాల ప్రకారం గడ్డి అన్నారం డివిజన్ శారదనగర్ చెందిన వ్యక్తి(50) మలక్‌పేట గంజిలో నూనె వ్యాపారం చేస్తున్నాడు. జ్వరంతో బాధపడుతూ వనస్దలిపురం ఏ క్వార్టర్స్‌లో నివాసం ఉండే సోదరుని ఇంటికి వచ్చి అతడి సహాయంతో స్దానికంగా ఉన్న జీవన్‌సాయి ఆసుపత్రిలో ఈనెల 22నుంచి 25వరకు చికిత్స పొందాడు.

అయితే అతనికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించి, సోదరుడి కుటుంబసభ్యులను ఇంటిలోనే క్వారంటైన్ చేశారు. వెంటనే అతడి సోదరుడి తండ్రికి సోకింది. అప్పటికే షుగర్, బీపీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వృద్దుడిని మూడు రోజుల కితం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మొదటి కరోనా పాజిటివ్‌గా తేలిన నూనె వ్యాపారి నుంచి అతడి భార్యకు, సోదరుడి భార్య, ఇద్దరు కూతుళ్లుకు వైరస్ సంక్రమించింది. దీంతో జిల్లా వైద్యాధికారులు, జీహెచ్‌ఎంసీ, పోలీసు సిబ్బంది కాలనీని సందర్శించారు. కాలనీలో కొంతమేరకు రెడ్‌గా ప్రకటించి బారికేడ్లు ఏర్పాటు చేశారు.

6 Same Family Members tests positive for Covid 19

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News