Saturday, April 27, 2024

’సిపిజిఇటి-2021’ నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

TS CPGET 2021 Notification Released

సిపిజిఇటి నోటిఫికేషన్ విడుదల
30 నుంచి దరఖాస్తులు
సెప్టెంబర్ 8 నుంచి పరీక్షలు
పిజి కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిధిలో పిజి కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ’సిపిజిఇటి-2021’ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఆరు సాంప్రదాయ విశ్వవిద్యాలయాలతోపాటు జెఎన్‌టియుహెచ్‌లో ఎం.ఎ, ఎం.ఎస్‌సి, ఎం.కాం, ఎంసిజె, ఎంఎల్‌ఐబి, ఎం.ఇడి, ఎంపిఇడి తదితర పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి పిజి ప్రవేశ పరీక్ష(సిపిజిఇటి-2020) నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. సెప్టెంబర్ 8వ తేదీనఆన్‌లైన్ నుంచి (సిబిటి-కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు సిపిజిఇటి కన్వీనర్ ఐ.పాండురంగారెడ్డి పేర్కొన్నారు. ఈనెల 30నుంచి సిపిజిఇటి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తుల సమర్పణకు ఆగస్టు 25 చివరి తేదీ. రూ.500 అపరాధ రుసుంతో ఆగస్టు 30 వరకు, రూ.2 వేల అపరాధ రుసుంతో సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. సిపిజిఇటి పరీక్ష ఫీజు జనరల్ విద్యార్థులకు రూ.800, ఎస్‌సి,ఎస్‌టి, వికలాంగులకు రూ.600 చెల్లించాలి. అదనపు సబ్జెక్టులకు ఒక్కో సబ్జెక్టుకు రూ.450 ఫీజు ఉంటుంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జెఎన్‌టియుహెచ్ యూనివర్సిటీలలో పిజి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

TS CPGET 2021 Notification Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News