Sunday, May 5, 2024

పన్ను చెల్లింపుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..

- Advertisement -
- Advertisement -

కీలక నిర్ణయం తీసుకుంది.

 

మన తెలంగాణ/హైదరాబాద్:ఆస్తిపన్ను చెల్లింపుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్తిపన్ను చెల్లించే వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అన్ని పట్టణాల్లో ఆస్తి పన్నుపైన ఐదుశాతం ఎర్లీబర్డ్ ప్రోత్సహాకాన్ని ప్రకటించింది. దీంతోపాటు ఇప్పటిదాకా వార్షిక ఆస్తిపన్ను కేవలం రూ.30వేల వరకు ఉన్న పరిమితిని ఎత్తివేస్తూ శనివారం పురపాలక శాఖ నిర్ణయం తీసుకుంది. ఆస్తిపన్ను ఎంత ఉన్నప్పటికీ ఈ నెల 31లోపు పన్ను చెల్లిస్తే ఐదు శాతం ప్రోత్సాహాకం వర్తించనున్నట్లు ప్రకటించింది. అయితే రెసిడెన్షియల్, కమర్షియల్ కేటగిరీల వారికి మాత్రమే ఈ ఎర్లీబర్డ్ ప్రోత్సాహకం వర్తింపజేస్తున్నట్టు తెలిపింది.

TS Govt Announces 5 percent rebate to property tax

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News