Wednesday, May 15, 2024

అమెరికా చదువులకు ఎస్‌సి గురుకుల విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ చదువుల కోసం తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీ విద్యార్థులు అర్హత సాధించారు. స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎస్‌ఎటి) లో అసాధారణ స్కోర్ లభించడం వల్ల ఈ విద్యార్థుల ట్యూషన్ ఫీజులో 75 శాతం స్కాలర్ షిప్‌కు ఎంపికయ్యారు, అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఇలా ఎంపిక కావడం చారిత్రాత్మకమని అధికారులు వెల్లడించారు. సాంఘ్కీ సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీకి చెందిన లావణ్య, హారిక, స్వప్నిక, చైతన్యలు 2022 ఆగష్టులో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వెళ్ళేందుకు సిద్దమవుతున్నారు. లావణ్య, హారిక, స్వప్నిక లు అయోవా స్టేట్ యూనివర్శిటీలో 4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని అభ్యసిస్తారు., చైతన్యమ మిల్వాకి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని అభ్యసించనున్నారు. ఈవిద్యార్థులు స్యాట్ క్యాంప్‌లో శిక్షణ పొందారు. సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఈ క్యాంప్‌ను నిర్వహించింది. స్యాట్ సలహాదారు మూర్తి పొలాస, టాలెంట్ మేనేజ్‌మెంట్ స్పెషల్ ఆఫీసర్, కోఆర్డినేటర్ గ్రేసేనా ప్రకాష్ ల ఆధ్వర్యంలో వీరు శిక్షణ పొందారు. గురుకుల సొసైటీ చరిత్రలో అట్టడుగు వర్గాల విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోడానికి ఖండాంతరాలు దాటడం ఇదే మొదటిసారి. ఈ విద్యార్థులు పేదరికపు సంకెళ్ళను ఛేదించి, తమ తోటి విద్యార్థులకు మార్గదర్శకంగా మారారు. ఈ ప్రాజెక్టుకు సొసైటి జాయింట్ సెక్రటరి శారద మార్గదర్శకత్వం వహించడంలో కీలకపాత్ర పొషించారు.

TS Gurukul Jr College Students select for UG Admissions in US

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News