Tuesday, April 30, 2024

కమ్మ, వెలమ సంఘాలకు భూ కేటాయింపుపై హైకోర్టు స్టే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కమ్మ, వెలమ సంఘాలకు భూములు కేటాయించడంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. కులాల వారీగా భూముల కేటాయింపును తప్పుబట్టిన కోర్టు.. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2021లో తెలంగాణ ప్రభుత్వం కమ్మ, వెలమ సంఘాలకు ఖానామెట్ లో ఐదు ఎకరాల చొప్పున భూమి కేటాయించింది. దీనిపై కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి హైకోర్టులో వేసిన పిల్ పై సిజె బెంచ్ బుధవారం విచారించింది.

అణగారిన వర్గాలకు భూములు ఇస్తే అర్థ చేసుకోవచ్చునని.. కాని, బలమైన కుల సంఘాలకు భూములు ఇవ్వడం ఎందుకని బెంచ్ ప్రశ్నించింది. ఇలా భూములు కేటాయించడం కూడా ఒక విధమైన కబ్జానే అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా సాయిసింధు ఫౌండేషన్ కు ప్రభుత్వం కేటాయించిన భూమి రద్దును హైకోర్టు గుర్తు చేసింది. భూ కేటాయింపులపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే కొనసాగుతుందని వెల్లడించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు కమ్మ సంఘానికి కోర్టు అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 2వ తేదీకి వాయిదా వేసింది.

Also Read: బటన్ నొక్కడం అంటే తెలియని బడుద్దాయులకు చెప్పండి: సిఎం జగన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News