Tuesday, April 30, 2024

కొవిడ్ కట్టడిలో మనమే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

ఇంటింటికి జ్వర సర్వేతో సత్ఫలితాలు

రాష్ట్రంలో 91శాతానికి కరోనా రోగుల రికవరీ రేటు
ప్రైవేటు ఆసుపత్రులపై 26 ఫిర్యాదులు వచ్చాయి
ఓ దవాఖానా అనుమతి రద్దు, మరో మూడింటికి షోకాజు నోటీసులు
బ్లాక్ ఫంగస్ కేసులకు మెరుగైన చికిత్సను అందిస్తున్నాం
ప్రజలెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు
సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ఆధ్వర్యంలో మందులు, మౌలిక వసతుల కొరత లేకుండా ఏర్పాటు చేస్తున్నాం
మీడియాతో హెల్త్ డైరెక్టర్ డా.జి.శ్రీనివాసరావు, డిఎంఇ డా.రమేష్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: కొవిడ్ కట్టడిలో తెలంగాణ దేశానికి మార్గదర్శిగా నిలుస్తోందని ప్రజారోగ్య, కుటుంబ శాఖ సంచాలకులు డా.జి శ్రీనివాసరావు అన్నారు. సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నా యన్నారు. ఇంటింటికి జ్వర సర్వే చేస్తూ, లక్షణాలు ఉన్నోళ్లందరికీ కిట్లు ఇవ్వడం వలన ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైరస్ తీవ్రత తగ్గిందన్నారు. మన దగ్గర ప్రారంభించిన పది రోజుల తర్వాత దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యాయని చెప్పారు. జిహెచ్‌ఎంసి నుంచి జిల్లాల వరకు కొత్త ఇన్‌ఫెక్షన్లు తగ్గి, తద్వారా ఆసుపత్రుల్లో అడ్మిషన్లు తగ్గాయన్నారు. ఈనెల మొదటి వారంలో సుమారు సగటను 9.5 శాతం ఉన్న పాజిటివ్ రేట్ ప్రస్తుతం 5.43కి తగ్గిందన్నారు. సుమారు డబ్లూహెచ్‌ఓ సూచించిన సూచిక వద్దకు వచ్చేశామన్నారు. ఈ సెకండ్ వేవ్‌లో 2,37,843 మంది వైరస్ బారిన పడగా, ప్రస్తుతం కేవలం 48,110 మంది చికిత్స పొందుతున్నారన్నారు. అంటే ఏకంగా 80 శాతం మంది పూర్తిగా రికవరీ అయ్యారన్నారు. విస్తృతంగా టెస్టులు చేయడం, ఎక్కడికక్కడ వైరస్ చైన్‌ను బ్రేక్ చేసేందుకు సమర్ధవంతంగా పనిచేయడం వంటివి సెకండ్ వేవ్ కంట్రోల్‌కు కారణమయ్యాయన్నారు. ప్రతి రోజూ సిఎం, సిఎస్, ఇతర ఉన్నతాధికారుల ఆదేశాలతో నివారణ చర్యలను వేగవంతం చేశామన్నారు. ప్రభుత్వం, వైద్యశాఖ తీసుకున్న నిర్ణయాలను ఆశాలు, ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌నర్సులు క్షేత్రస్థాయిలో అద్బుతంగా అమలు చేశారన్నారు. దీంతోనే 50 శాతం కేసులు కేవలం 18 రోజుల్లో తగ్గుముఖం పట్టాయన్నారు. రానున్న రోజుల్లో మరింత తగ్గే ఆస్కారం ఉందన్నారు. దీనికి లాక్‌డౌన్, నైట్‌కర్ఫూలు ఎంతో మేలును చేకూర్చాయన్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలు ప్రజలు మరిన్ని రోజులు తు.చ తప్పక పాటించాలన్నారు. లాక్‌డౌన్‌లో బలంగా తీసుకోవాలి. మరోవైపు మార్చిలో 80 శాతం రికవరీ రేట్ ఉండగా, ప్రస్తుతం 91 శాతంగా నమోదవుతుందన్నారు. అయితే అవవసరంగా ప్రజలు భయపడాల్సిన పనిలేదని, కానీ ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్తగా ఉండొద్దని ఆయన సూచించారు.
మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి పర్మీషన్‌ను రద్దు చేశాం…
కరోనా చికిత్స విషయంలో ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించని మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి పర్మీషన్‌ను రద్దు చేశామని డిహెచ్ తెలిపారు. ఇక నుంచి ఆ ఆసుపత్రిలో కొవిడ్ చికిత్సలు జరగవన్నారు. అయితే ఇప్పటి వరకు 26 ఫిర్యాదులు రాగా, వీటిలో నాగోల్, బషీర్‌బాగ్, సికింద్రాబాద్‌లోని మూడు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులిచ్చామన్నారు. వాటిపై పూర్తి విచారణ నిర్వహించినచర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులపై 9154170960 వాట్సప్ నంబరుకు ఫిర్యాదు చేయొచ్చని ప్రకటించారు.
ప్రతి రోజూ మూడు నాలుగు అంబులెన్స్‌లు వస్తున్నాయి…
కర్ణాటక, మహరాష్ట్ర, చత్తీస్‌గడ్, ఏపి, రాష్ట్రాల నుంచి తెలంగాణకు ప్రతి రోజూ కనీసం మూడు నుంచి నాలుగు అంబులెన్స్‌లు వస్తున్నాయని డిహెచ్ తెలిపారు. వారందరికి మన దగ్గర మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. మరేరాష్ట్రం ఈ తరహాలో చికిత్స నిర్వహించడం లేదన్నారు. ఇప్పటికే సుమారు 45 శాతం మంది పేషెంట్లకు వైద్యం అందిస్తున్నామన్నారు.
236 నుంచి 1242కు ఆసుపత్రుల్లో చికిత్స నిర్వహిస్తున్నాం…
మొదటి దశ కరోనాలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి కేవలం 236 ఆసుపత్రుల్లో చికిత్స అందించగా, వేవ్ 2లో వాటిని ఏకంగా 1242కు పెంచామన్నారు. 18,232 బెడ్ల నుంచి 53,775 బెడ్లను కూడా పెంచామన్నారు. వీటిలో సాధారణ, ఆక్సిజన్, ఐసియూ బెడ్లున్నాయన్నారు. అయితే ప్రస్తుం బెడ్ ఆక్యూపెన్సీ 52 శాతం ఉందన్నారు. వీటిలో ఐసియూ 73 శాతం, ఆక్సిజన్ 67 శాతం ఉందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఎక్కడా బెడ్ల కొరత లేదన్నారు. అనవసరంగా ప్రైవేట్‌కు వెళ్లి లక్షల రూపాయాలను వృథా చేసుకోవద్దన్నారు.
మంత్రి కెటిఆర్ చొరవతో వందలాది ఇంజక్షన్లు వస్తున్నాయి..
స్టేట్ టాస్క్‌పోర్స్ కమిటీ చైర్మన్, మంత్రి కెటిఆర్ ప్రత్యేక చొరవతో రెమ్‌డెసివిర్, తొసిలిజూమబ్, బ్లాక్ ఫంగస్ చికిత్సకు వినియోగించే యాంటీ ఫంగల్ ఇంజక్షనలు వందాలాదిలో వస్తున్నాయని డిహెచ్ తెలిపారు. ఇప్పటికే ఆయన వివిధ కంపెనీలతో నేరుగా మాట్లాడి రాష్ట్రానికి తెప్పిస్తున్నారన్నారు.అంతేగాక ఆక్సిజన్ యంత్రాలు, వెంటిలేటర్లు కూడా వస్తున్నాయన్నారు.
3 లక్షల 40 వేల కిట్లను పంపిణీ చేశాం…
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3 లక్షల 40 వేల 507 ఐసోలేషన్ కిట్లను పంపిణీ చేశామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు. వీటిలో ఓపి ద్వారా 1,52,139, ఫీల్డ్ సర్వే ద్వారా 1,88,368 కిట్లను ఇచ్చామన్నారు. దీంతో వ్యాధిని వేగంగా కంట్రోల్ చేసేందుకు ఉపయోపడుతుందన్నారు. అంతేగాక 85 లక్షల ఇళ్లల్లో సుమారు 7 లక్షల 12 వేల మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేశామన్నారు. ఐసోలేషన్‌లో సీరియస్ అయిన వాళ్లకు వెంటనే 108 ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నామన్నారు.
డోసులు రాగానే వ్యాక్సిన్ అందిస్తాం…
కేంద్ర ప్రభుత్వం నుంచి డోసులు వచ్చిన వెంటనే వ్యాక్సినేషన్‌ను పుఃనప్రారంభిస్తామని హెల్త్‌డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు అన్నారు. తాము కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారమే వ్యాక్సినేషన్‌ను నిర్వహిస్తామన్నారు. దేశ వ్యాప్తంగా రెండు కంపెనీలు మాత్రమే వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్నందు వలన డోసుల కొరత ఉందన్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 57 లక్షల డోసులు ఇవ్వగా, మన రాష్ట్రం సొంతంగా 4.90 డోసులను కొనుగోలు చేసిందన్నారు. అయితే ప్రస్తుతం మన దగ్గర కేవలం 50 వేల కొవాగ్జిన్ టీకాలు మాత్రమే ఉన్నాయన్నారు. కేంద్రం నుంచి మరిన్ని డోసులు రాగానే టీకా కార్యక్రమాన్ని మళ్లీ పుఃనప్రారంభిస్తామన్నారు. సిఎం నిర్ణయం తర్వాత తేది నుంచి ప్రకటిస్తామన్నారు. ఇక కొవిషీల్డ్ గడువు పూర్తయి అర్హత కలిగిన వారు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇప్పట్లో ఉండరన్నారు. అయితే వ్యాక్సిన్ సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సిఎం గ్లోబల్ టెండర్‌ను కూడా పిలుస్తున్నారని చెప్పారు. మంత్రి కెటిఆర్ కూడా పర్సనల్‌గా కంపెనీలతో మాట్లాడుతున్నారు.
సామాజిక బాధ్యతతో వ్యవహరించండి..
కరోనా అంశంపై ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని డిహెచ్ పేర్కొన్నారు. కొంత మంది అవసరం లేని విషయాలను పదే పదే సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని,ఇది సబబు కాదన్నారు. ప్రజలెవ్వరూ వాటిని చూసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో 50మంది బ్లాక్ ఫంగస్ కేసులకు చికిత్స నిర్వహిస్తున్నాం
గాంధీ, కింగ్‌కోఠి ఆసుపత్రుల్లో 50 మంది బ్లాక్ ఫంగస్ కేసులకు చికిత్స నిర్వహిస్తున్నామని డిఎంఇ డా రమేష్‌రెడ్డి తెలిపారు. వీటితో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరో 30 మంది ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వారంతా ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో నయ పైసా ఖర్చు లేకుండా మెరుగైన ట్రీట్మెంట్ అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అయితే కొవిడ్ తర్వాత ఇళ్లకు చేరిన వాళ్లంతా ఇంట్లో కూడా కొన్నాళ్లు మాస్కు ధరించడం మేలన్నారు. తద్వారా గాలిలో ఉండే బ్లాక్ వైరస్ శరీరంలోకి వెళ్లకుండ ఉంటుందన్నారు. ముఖ్యంగా డయాబెటిస్, ఇమ్యూనోకాంప్రమైస్ పేషెంట్లు మరింత అప్రమత్తంగా ఉండలన్నారు. మరోవైపు 6 మెడికల్ కాలేజీలను పెంచుతున్నందుకు సిఎం కెసిఆర్ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఇదిలా ఉండగా స్టెరాయిడ్స్ ఇతర మందులు వాడకం కొరకు ప్రత్యేక కమిటీని వేశామన్నారు. దాని ప్రకారం ఇక నుంచి మందులు ఇస్తామన్నారు. దీంతో పాటు వరంగల్, ఆదిలాబాద్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు స్టాప్ కూడా తీసుకుంటున్నామన్నారు. 604 పోస్టులకు అతి త్వరలో నియమిస్తామన్నారు.

TS Health Director Srinivasa Rao Press Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News