Wednesday, May 8, 2024

నేడు పాలిసెట్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

TS POLYCET 2020 results to release tomorrow

హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి శ్రీనాథ్ తెలిపారు. ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను మండలి విడుదల చేసింది. ఈనెల 18న జరిగిన పాలిసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 92,556 మంది హాజరయ్యారు. పాలిటెక్నిక్, వ్యవసాయ, పశువైద్య డిప్లొమా కోర్సులతో పాటు బాసర ఆర్‌జియుకెటిలో కూడా పాలిసెట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేయనున్నారు.

ఆగస్టు 5 నుంచి కౌన్సెలింగ్

పాలిసెట్ కౌన్సెలింగ్ ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు పాలిసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ షెడ్యూల్ ప్రకటించారు. ధ్రువపత్రాల పరిశీలన కోసం ఆగస్టు 5 నుంచి 9 వరకు ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని తెలిపారు. అదే నెల 6 నుంచి 10 వరకు పాలిసెట్ అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. దీంతో పాటు 6 నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఆగస్టు 14న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.

వచ్చేనెల 23 నుంచి తుదివిడత కౌన్సిలింగ్

పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుంది. అదే రోజు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆగస్టు 24న రెండవ విడత ధ్రువపత్రాల పరిశీలన, 24, 25 తేదీల్లో రెండవ విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 27న రెండవ విడత పాలిటెక్నిక్ సీట్లు కేటాయిస్తారు.

సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంవత్సరం

పాలిటెక్నిక్ కళాశాలల్లో సెప్టెంబరు 1న విద్యా సంవత్సరం ప్రారంభించి, అదే నెల 6వ తేదీ నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. స్పాట్ అడ్మిషన్ల కోసం సెప్టెంబరు 1న మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.

TS POLYCET 2021 results to release tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News