Monday, May 6, 2024

రేపు టిటిడి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మార్చి నెలకు సంబంధించి శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను శుక్రవారం ఆన్‌లైన్‌లో టిటిడి విడుదల చేయనుంది. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లను కూడా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని టిటిడి అధికారులు వెల్లడించారు.

అలాగే మార్చి నెలకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, వర్చువల్ సేవా టికెట్ల కోటాను శుక్రవారం సాయంత్రం 4 గంటల విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News