Tuesday, May 14, 2024

జూన్ 28 నుండి నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి  వార్షిక బ్రహ్మోత్సవాలు

- Advertisement -
- Advertisement -

తిరుపతి:  అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 28 నుండి జూలై 6వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జూన్ 27వ తేదీ అంకురార్పణ నిర్వహిస్తారు.

జూన్ 28న ఉదయం 9 నుండి 10 గంటల వరకు సింహ లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.   బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగుతాయి.

వాహనసేవల వివరాలు :

తేదీ 28-06-2023

ఉదయం – ధ్వజారోహణం

రాత్రి – యాలి వాహనం

29-06-2023

ఉదయం – పల్లకీ సేవ

రాత్రి – హంస వాహనం

30-06-2023

ఉదయం – పల్లకీ సేవ

రాత్రి – సింహ వాహనం

01-07-2023

ఉదయం – పల్లకీ సేవ

రాత్రి – హనుమంత వాహనం

02-07-2023

ఉదయం – శేష వాహనం

రాత్రి – గరుడ వాహనం

03-07-2023

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

04-07-2023

ఉదయం – ఆర్జిత కల్యాణోత్సవం (ఉదయం 10 గంటలకు)

రాత్రి – గజ వాహనం

05-07-2023

ఉదయం – రథోత్సవం  (ఉదయం 9 గంటలకు)

రాత్రి – అశ్వవాహనం

06-07-2023

ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం

జూలై 4వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాలు  బహుమానంగా అందజేస్తారు. జూలై 7న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News