Sunday, May 5, 2024

ముష్కరుల కాల్పుల్లో కాశ్మీరీ నటి అమ్రీన్ భట్ మృతి

- Advertisement -
- Advertisement -

TV actress Amreen Bhat killed in terrorist shooting

న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. బుద్గామ్‌ జిల్లాలో ముగ్గురు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు ఓ మహిళా టీవీ ఆర్టిస్టు అమ్రీన్‌ భట్‌ను కాల్చి చంపారు. ఈ ఘటనలో పదేళ్ల వయసున్న ఆమె మేనల్లుడు ఫర్హాన్ జుబైర్ గాయపడ్డాడు. నిన్న రాత్రి 7:55 నిమిషాలకు సెంట్రల్ కశ్మీర్ జిల్లాలోని హషూరా చదూరా ప్రాంతంలోని తన ఇంట్లో ఉన్న అమ్రీన్ భట్, మెనల్లుడిపై కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వెద్యులు వెల్లడించారు. ఆమె మేనల్లుడి చేతికి బుల్లెట్ గాయమైందని, ప్రస్తుతం కోలుకుంటున్నాడని కశ్మీర్‌ పోలీసులు తెలిపారు. సమాచారం అందగానే ఆ ప్రాంతాన్ని పూర్తిగా నిర్బందించి గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఈ దాడిని ఖండించాయి. తన కూతురు అమ్రీన్ భట్ మృతిపై తల్లిదండ్రులు, బంధువులు విచారం వ్యక్తం చేశారు. అమ్రీన్‌ బయటకు షూటింగ్‌కు రానని చెప్పడంతో కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News