Friday, May 10, 2024

అప్సరకు గతంలోనే వివాహం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః అప్సర హత్య కేసులో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు అప్సరకు వివాహం కాలేదని భావిస్తుండగా ఆమెకు గతంలోనే వివాహమైందని, భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. చెన్నైకి చెందిన యువకుడిని వివాహం చేసుకున్న అప్సర అతడు ఆత్మహత్య చేసుకున్న తర్వాత కుటుంబంతో పాటు నగరానికి వచ్చి రెండేళ్ల నుంచి ఉంటూ సీరియల్స్‌లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గుడికి వచ్చే అప్సరతో సాయికృష్ణకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధం వరకు దారితీసింది.

సాయికృష్ణకు గతంలో కూడా వేరే యువతితో కూడా సంబంధం ఉన్నట్లు తెలిసింది. గుడికి అప్పుడప్పుడు వెళ్లడంతో అప్సరకు అక్కడే ప్రధాన పూజారిగా పనిచేస్తున్న సాయికృష్ణకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఏడాది నుంచి ఇద్దరి మధ్య సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే అప్సర గర్భం దాల్చడంతో వివాహం చేసుకోవాలని సాయికృష్ణపై ఒత్తిడి తీసుకువచ్చింది. అప్సర గర్భం దాల్చడంపై అనుమానం ఉన్న సాయికృష్ణ ఆమె నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేక హత్య చేయాలని మూడు నెలల నుంచి ప్లాన్ వేస్తున్నాడు. అనువైన సమయంలో చూసుకుని అహత్య చేసి తన ఇంటి సమీపంలోనే పూడ్చి పెట్టాడు.

సాయికృష్ణ కుటుంబం తప్పుడు ప్రచారం చేస్తున్నారుః అప్సర తల్లి అరుణ
తన కూతురును చంపడమే కాకుండా సాయికృష్ణ కుటుంబం తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అప్సర తల్లి అరుణ ఆవేదన వ్యక్తం చేసింది. కూతురు చనిపోయిన బాధలో మేము ఉన్నామని, ఈ సమయంలో అప్సర వ్యక్తిగత విషయాలు మీడియాలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. గుడికి పోయిన తమ కూతురిని సాయికృష్ణ ట్రాప్ చేశాడని ఆరోపించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేయాలని, ప్రభుత్వం, పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరింది.

మూడు నెలల నుంచి తమ కుమారుడిని వేధిస్తోందిః సాయికృష్ణ తండ్రి
మూడు నెలల నుంచి అప్సర తమ కుమారుడిని వేధింపులకు గురిచేస్తోందని సాయికృష్ణ తండ్రి ఆరోపించారు. తమ కుమారుడికి పిల్లలు ఉన్నా కూడా వివాహం చేసుకోవాలని ఇబ్బంది పెట్టిందని తెలిపారు. సాయికృష్ణ అప్సర ఇంటికి వెళ్తున్నట్లు తెలిస్తే ముందే మందలించేవాడినని అన్నారు. అప్సర చాలామందితో సన్నిహితంగా ఉంటోందని ఆరోపించారు. సాయికృష్ణను అన్నా అని పిలిచేదని, అలాంటప్పుడు వివాహం చేసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చిందని అన్నారు. ఈ విషయంలో ఇద్దరి తప్పు ఉందని, అప్సరను కట్టడి చేయడంతో ఆమె తల్లి విఫలమైందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News