Thursday, November 7, 2024

బైక్‌ దొంగలు అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Two bike thieves arrested by Falaknuma policeపది బైక్‌లను స్వాధీనం చేసుకున్న ఫలక్‌నూమ పోలీసులు

హైదరాబాద్: మోటార్ సైకిళ్లను చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను ఫలక్‌నూమ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి పోలీసులు పది బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. సౌత్‌జోన్ డిసిపి గజారావు భూపాల్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన ఎండి సిరాజుద్దిన్, ఎండి హమీద్ ఇద్దరు బైక్‌లు చోరీ చేయడంలో నిపుణులు. ఇద్దరు కలిసి నగరంలోని ఫలక్‌నూమాలో రెండు, కాలాపత్తర్‌లో 2, బాలాపూర్‌లో 2, షాలీబండ, చాంద్రాయణగుట్టలో ఒకటి చొప్పున బైక్‌లను దొంగతనం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 190 సిసి కెమెరాలు పరిశీలించి నిందితులను గుర్తించారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులను పట్టుకున్న ఎస్సై చంద్రశేఖర్‌ను అధికారులు అభినందించారు.

Two bike thieves arrested by Falaknuma police

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News