Saturday, May 11, 2024

ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్టు

- Advertisement -
- Advertisement -

Two chain snatchers arrested in Hyderabad

హైదరాబాద్: ఒంటిరిగా వెళ్తున్న మహిళల బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను మూడున్నర తులాల బంగారుభరణాలు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఎపిలోని గుంటూరు జిల్లాలో ముత్తూట్ ఫైనాన్స్‌లో పెట్టిన నాలుగు తులాల పుస్తెల తాడును స్వాధనీ చేసుకున్నారు. మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. టోలీచౌకికి చెందిన అఫ్రోజ్ అలియాస్ అప్రోజ్ ఖాన్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మీరాజ్ కాలనీకి చెందిన ఎండి అమీర్ అలియాస్ ఇమ్రాన్ క్లాత్‌స్టోర్స్‌లో సేల్స్ మ్యాన్‌గా పనిచేస్తున్నాడు.

అఫ్రోజ్ ఐద తరగతి వరకు చదువుకున్న తర్వాత ఆపివేశాడు. తర్వాత బృందావన్ కాలనీలో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. మరో నిందితుడు సోహైల్ కురేషీతో కలిసి చైన్‌స్నాచింగ్ చేశాడు. ఇతడు చర్లపల్లి జైలులో ఉన్నాడు. పన్నెండ్ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. నిందితుడిపై పదహారు కేసులు ఉన్నాయి. అఫ్రోజ్ ఖాన్‌పై 16కేసులు ఉన్నాయి. ఎండి అమీర్ అలియాస్ ఇమ్రాన్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. గతంలో హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు వాహనాలను దొంగతనం చేశాడు. ఫిబ్రవరిలో చంచ్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. పుప్పాలగూడకు చెందిన దాసరి శిరీషా తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా నిందితులు బైక్ వచ్చి మెడలోని పుస్తెల తాడును దొంగిలించాడు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News