Monday, April 29, 2024

జపాన్‌లో జంట భూకంపాలు

- Advertisement -
- Advertisement -

టోక్యో : జపాన్‌లో గురువారం రెండు సార్లు భూమి కంపించింది. ఈ ప్రకంపనల తీవ్రత రెక్టర్ స్కేలుపై వరుసగా 6.5 , 5.0గా నమోదు అయింది. వెంటవెంటనే రెండు సార్లు భూ కంపం చోటుచేసుకోవడంతో అసలుకే భూకంపాల భయకంపిత జపాన్‌లో కలవరం చెలరేగింది. అమెరికాకు చెందిన భూగర్భ అధ్యయనాల సంస్థ (యుఎస్‌జిఎస్) ఈ భూకంపాల తీవ్రతను రికార్డు చేసింది. మొట్టమొదటి ప్రకంపనలు మధ్యాహ్నం 2.45 గంటలకు కురిల్ దీవుల ఆగ్నేయ తీరంలో ప్రధాన కేంద్రంగా చెలరేగాయి. తరువాత 3.07 నిమిషాలకు మరో భూకంపం వచ్చింది.

ఈ రెండు ప్రకంపనలు భూమి పొరల్లో మొదటిది దాదాపు 24 కిలోమీటర్ల లోతున నెలకొన్నాయి. రెండోది ఇదే ప్రాంతంలో దాదాపు 40 కిలోమీటర్ల అడుగున కేంద్రీకృతం అయిందని నిపుణులు విశ్లేషించారు. జపాన్‌లో ఏడాది పొడవునా ఎక్కువ సార్లు భూ కంపం సంభవించడం జరుగుతోంది. ఈ నెల ఆరంభంలో కూడా వచ్చిన భూకంపంతో సునామీ హెచ్చరికలు వెలువడ్డాయి. ఇప్పుడు వచ్చిన రెండు వరుస ప్రకంపనలతో ఎంతటి నష్టం వాటిల్లింది? ప్రాణహానీ జరిగిందా? అనే వివరాలు తెలియలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News