Saturday, April 27, 2024

ధోనిపాములలో ఇద్దరు ఉపాధి హామీ కూలీలు మృతి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ/చండూరు: మండల పరిధిలోని దోనిపాముల గ్రామంలో ఉపాధి పనికి వెళ్లిన ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కుటింబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. దోనిపాముల గ్రామానికి చెందిన చిలకరాజు లింగమ్మ(60), సూరి లక్ష్మమ్మ (60) రోజు మాదిరిగా కూలికి వెళ్లి ఉపాధి పని ముగించుకుని కాళ్లు చేతులు కడుక్కుందామని పక్కనే ఉన్న నీటికుంటలోకి దిగగా ప్రమాదవశాత్తు కాలు జారి కుంటలో పడి మృతి చెందారు. మొదట నీటికుంటలోకి లక్ష్మమ్మ జారడంతో ఆమెను రక్షించే ప్రయత్నంలో లింగమ్మ జారిపడటంతో ఇద్దరూ కుంటలో పడి అక్కడికక్కడే మృతి చెందారు.

పనికి వెల్లిన వారు ఇంకా రాలేదని కుటుంబ సభ్యులు పనివద్దకు వెళ్లగా నీటి గుంటవద్ద పనిముట్లు, వాటర్ బాటిల్ కనిపించాయి. దీంతో వారు కుంటలో చూడగా ఇద్దరు మృతి చెంది ఉన్నారు. ఇద్దరు కూలీలు నీటి గుంతలో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. కాగా అందులో ఒక కూలీకి ఉపాధి హామి పని కార్డు లేకపోవడంతో చర్చాంశంగా మారింది . మృతుల కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నవీన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News