Tuesday, March 19, 2024

ఇక వారానికి నాలుగున్నర రోజులే పని

- Advertisement -
- Advertisement -

UAE announces 4.5 day workweek

వారాంతంలో కూడా మార్పు
యుఎఇ విప్లవాత్మక నిర్ణయం

దుబాయి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్( యుఎఇ) విప్లవాత్మక మార్పునకు నాంది పలికింది. ఇకపై తమ దేశంలో వారానికి నాలుగున్నర రోజులే పని దినాలని ప్రకటించింది. అంతేకాకుండా.. వారాంతాన్ని కూడా ఇంతకు ముందున్న శుక్ర, శనివారాలనుంచి శని, ఆదివారాలకు మార్చింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వారాంతం శుక్రవారం మధ్యాహ్నంనుంచి ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది జనవరి 1నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుదని అధికారులు తెలిపారు. ప్రభుత్వ సంస్థలు, విభాగాలు అన్నీ ఈ కొత్త విధానాన్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచంలో నాలుగున్నర రోజుల పని విధానాన్ని పాటిస్తున్న తొలి దేశం తమదేనని అక్కడి అధికారులు అంటున్నారు. ఉద్యోగుల వృత్తిగత, వ్యక్తిగత జీవితాల మధ్య సమతౌల్యం సాధించడంతో పాటు ప్రపంచ మార్కెట్లలో పాటిస్తున్న విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు గల్ఫ్ దేశాల్లో వీకెండ్ అంటే శుక్ర, శనివారాలే. ప్రపంచంలోని మిగతా దేశాల్లో శని, ఆదివారాల్లో ప్రజలు వీకెండ్ సెలవు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యుఎఇ కూడా ఇతర దేశాలను అనుకరిస్తూ కొత్త విధానాన్ని అవలంబించేందుకు నిర్ణయించింది. ఇటువంటి నిర్ణయం తీసుకున్న తొలి గల్ఫ్ దేశంగా యుఎఇ చరిత్ర సృష్టించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News