Friday, April 26, 2024

ప్రతిభకు పట్టం.. వలసలకు కట్టడి

- Advertisement -
- Advertisement -
uk-visa
బ్రిటన్ కొత్త వీసా విధానం

లండన్ : బ్రిటన్ తాజా వీసా వ్యవస్థను ప్రకటించింది. అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు వీలుగా ఈ కొత్త వీసా విధానం తీసుకువచ్చినట్లు దేశ హోం మంత్రి ప్రీతీ పటేల్ బుధవారం తెలిపారు. భారత్‌తో పాటు ప్రపంచంలోని ప్రతిభావంతులకు వీసాలు ఇచ్చేందుకు నిబంధనలను తీసుకువచ్చినట్లు వివరించారు., బ్రెగ్జిట్ ఖరారు తరువాత వస్తోన్న వీసా విధానానికి అంతర్జాతీయ ప్రాధాన్యత ఏర్పడింది. నూతన విధానం జనవరి 1, 2021 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. కొత్త వీసా నిబంధనలు యూరోపియన్, నాన్ యురోపియన్ దేశాలకు ఒకే విధంగా వర్తిస్తాయి.

నైపుణ్యం,జీతం, వృత్తి ప్రాతిపదికన పాయి ంట్లు ఇస్తారు. ఈ మేరకు వీసా ఖరారు అవుతుంది. వలస కార్మికులపై ఎక్కువగా ఆధారపడకుండా, సరైన భద్రతా చర్యలతో దేశంలోకి వచ్చేవారిని నియంత్రిస్తామన్నారు. అమెరికా పలు దేశాలవారిపై వీసాల ఆంక్షలు విధించిన క్రమంలో బ్రిటన్ తన నూతన వీసా విధానాన్ని వెల్లడించింది. ప్రత్యేకించి ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు వీసాల జారీలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు భారతీయ సంతతికి చెందిన ప్రీతిపటేల్ తెలిపారు.

UK Announced new visa system

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News