Tuesday, April 30, 2024

బ్రిటన్ సందర్శన మరింత భారం..

- Advertisement -
- Advertisement -

లండన్ : బ్రిటన్‌లో సందర్శకుల వీసా రుసుం పెంచారు. ఇంతకు ముందు తీసుకున్న ఈ నిర్ణయం వచ్చేనెల (అక్టోబర్) 4 నుంచి అమలులోకి వస్తుంది. ఈ విషయాన్ని బ్రిటిష్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఆరు నెలల విజిటర్స్ వీసాకు ఇప్పుడు అదనంగా 15 పౌండ్లు (జిబిపి) చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇకపై 115 పౌండ్లు అవుతుంది. ఇక స్టూడెంట్స్ వీసాలపై కూడా భారం పడుతుంది. ఇది ఇప్పుడు 127 జిబిపిలు అవుతుంది. దీనితో భారతదేశంతో పాటు వివిధ దేశాల నుంచి బ్రిటన్‌కు వచ్చే సందర్శకులకు మరింత ప్రయాణ భారం పడుతుంది. శుక్రవారం సంబంధిత వీసా పెరుగుదల బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇతరదేశాల నుంచి విద్యాభ్యాసం కోసం వచ్చే వారు దరఖాస్తు చేసుకునే స్టూడెంట్‌స వీసాల కోసం దరఖాస్తుల రుసుంను ఇప్పుడు 490 పౌండ్లకు పెంచారు. ఇప్పుడు దేశంలో వచ్చే స్టూడెంట్స్ దరఖాస్తుల రుసుంతో సమానం అవుతుంది.

ఇటీవలి కాలంలో భారతదేశం నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ వీసాలపై బ్రిటన్‌కు వెళ్లుతున్నారు. ఈ ఏడాది జులైలోనే ప్రధాని రిషి సునాక్ ఈ వీసాల ఫీజులు పెరుగుతాయని ప్రకటించారు. ఈ ఫీజులు, హెల్త్ సర్‌ఛార్జిలలను పెంచడం ద్వారా సమకూరే డబ్బును ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ ఆరోగ్య సేవల విభాగం (ఎన్‌హెచ్‌ఎస్)కు బదలాయిస్తారని ప్రధాని తెలిపారు. దేశ ప్రభుత్వ రంగ ఉద్యోగుల వేతనాల పెంపుదల భారాన్ని సమగ్ర రీతిలో తట్టుకునేందుకు కూడా దీని వల్ల అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశానికి వలసగా వచ్చే వారిపై విధించే రుసుంలను పెంచనున్నట్లు , వారు వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు విధించే రుసుంను ఇక ఇమిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జ్ (ఐహెచ్‌ఎస్)గా వ్యవహరించనున్నట్లు కూడా రిషి సునాక్ అప్పట్లోనే వివరించారు. ఇప్పుడు సందర్శకులు, స్టూడెంట్స్ వీసాల దరఖాస్తుదారులు అదనపు భారం చెల్లించుకోవల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News