Wednesday, May 15, 2024

మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తాం: కేంద్ర మంత్రి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పిస్తామని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా స్పష్టం చేశారు. శనివారం ఉదయం మేడారం జాతరకు వచ్చిన అర్జున్ ముండా గద్దెలపై ఉన్న వన దేవతలను దర్శించుకొని, నిలువెత్తు బంగారం సమర్పించారు. దర్శనం అనంతరం అర్జున్ ముండా మీడియాతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న గిరిజనులు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుంటారని ఆయన తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే దేవతలుగా సమ్మక్క-సారలమ్మలు ప్రసిద్ధికెక్కారన్నారు. త్వరలోనే మేడారం మహాజాతరకు జాతీయ గిరిజన పండగ కల సాకారం అవుతోందని ఆశిస్తున్నాని ఆయన పేర్కొన్నారు. జాతీయ పండుగ హోదా అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తానని త్వరలోనే గిరిజనుల కలను నిజం చేస్తానని అర్జున్ ముండా స్పష్టం చేశారు. అర్జున్ ముండాకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ ఘనస్వాగతం పలికారు. మంత్రులు ఆయనకు దగ్గరుండి దర్శనం చేయించారు.
అర్జున్ ముండాకు మంత్రుల వినతి
మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వినతిపత్రం అందజేశారు. జాతీయ పండుగగా గుర్తించాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని అర్జున్ ముండాకు మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డిలు విజ్ఞప్తి చేశారు.

Union Minister Arjun Munda visits Medaram jatara

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News