Tuesday, May 7, 2024

ముషీరాబాద్‌లో పేలుడు.. వ్యక్తికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్‌: నగరంలోని ముషీరాబాద్‌లో శనివారం పేలుడు సంభవించింది.ముషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని రాంనగర్‌లో ఓ చెత్తకుప్ప వద్ద కెమికల్ డబ్బా పేలింది. పేలుడు సమయంలో చెత్త ఏరుకుంటున్న నాగయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన నాగయ్యను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సంఘటనాస్థలాన్ని డాగ్‌ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. చెత్తకుప్పలో ఉన్న పెయింట్‌ డబ్బా పేలినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం ఘటనాస్థలానికి వచ్చిన క్లూస్ టీం.. పేలుడుకు కారణమైన ఆ డబ్బాను స్వాధీనం చేసుకొని ల్యాబ్‌కు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Chemical box blasted at Dustbin in Musheerabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News