Friday, May 10, 2024

కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి లంచం తీసుకున్నారు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు బి ఫారాలు జారీ చేయడం కోసం అంచాలు తీసుకున్నందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డికె శివకుమార్‌పై చర్య తీసుకోవాలని కేంద్ర మంత్రి, రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకురాలు శోభా కరండ్లజే ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా పార్టీ టికెటు ఆ్లశిస్తున్న వారినుంచి కర్నాటక పిసిసి డబ్బులు తీసుకుందని శివకుమారే స్వయంగా చెప్పారని బిజెపి రాష్ట్ర ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ కన్వీనర్ కూడా అయిన కరండ్లజే ఆరోపించారు. వచ్చే నెల 10న ఎన్నికలు జరగనున్న కర్నాటకలో నామినేషన్ల దాఖలుకు ఈ నెల 20 చివరి తేదీ కాగా, నామినేషన్ల పరిశీలన శుక్రవారం జరిగింది.

‘ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఆశిస్తున్న వారినుంచి కెపిసిసి డబ్బులు వసూలు చేసిందని బిఫారాలు జారీ చేసే అధికారం కూడా ఉన్న శివకుమార్ బహిరంగంగానే చెప్పారు’ అని కర్నాటక ఎన్నికల ముఖ్య అధికారి మనోజ్ కుమార్ సిన్హాకు చేసిన ఫిర్యాదులో కరండ్లజే పేర్కొన్నారు. భారతీయ శిక్షాస్మృతి( ఐపిసి) కింద ఇది లంచం తప్ప మరోటి కాదు,అంతేకాదు ఎన్నికల చట్టాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఆమె తెలిపారు. అందువల్ల శివకుమార్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరిపైనా తగు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News