Thursday, May 16, 2024

పోలీసుల ప్రతాపం… బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

UP boy dead in police station

లక్నో: లాక్‌డౌన్ సమయం ముగిసిన తరువాత కూరగాయలు అమ్ముకుంటున్న బాలుడిని కానిస్టేబుళ్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి దెబ్బలు కొట్టడంతో అతడు చనిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లా బంగారమౌ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లాక్‌డౌన్ సడలింపు సమయం ముగిసిన తరువాత ఓ బాలుడు తన ఇంటి ముందు కూరగాయలు అమ్ముకుంటున్నాడు. పోలీసులు బాలుడిని పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాలుడిపై పోలీసులు తమ ప్రతాపం చూపడంతో స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే పోలీసులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయాడని వెల్లడించారు. దీంతో బాలుడు బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దీంతో ఉన్నతాధికారులు ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు హోంగార్డును సస్పెండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్ లాక్‌డౌన్ మే 24 ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉండనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News