Saturday, May 4, 2024

లారీల సమ్మె వల్లే నిర్మల్‌లో యూరియా కొరత

- Advertisement -
- Advertisement -

అన్ని జిల్లాల్లో సరిపడా నిల్వలు

వ్యవసాయశాఖ సమీక్షలో మంత్రి తుమ్మలకు అధికారుల వివరణ
బియ్యం ఎగుమతిపై కేంద్రానికి నివేదిక

మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయ రంగానికి అన్ని విధాల అనుకూలించే విధంగా రా ష్ట్రంలోని రైతు వేదికలను క్రియాశీలకంగా మా ర్చాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో అగ్రికల్చర్, హ్యాండ్లూమ్స్ గనుల సంచాలకులతో సమీక్ష స మావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో నమోదైన యూరియా కొరతకు సంబంధించి వ్యవసాయ సంచాలకులు మంత్రికి వివరిస్తూ ఇటీవల జరిగిన లారీల సమ్మె కారణంగానే యూ రియా కొరత ఏర్పడిందని,వారు సమ్మె విరమించడంతో ప్రస్తుతం అన్ని జిల్లాల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు, దీనిపై మంత్రి మాట్లాడుతూ వచ్చే సీజన్లో కూడా ఎటువంటి కొరత లేకుండ చూడాలనీ అధికారులకు సూ చించారు. మార్కెట్లలో అమ్మకాలు,కొనుగోళ్లు ముఖ్యంగా రోజు రోజుకి తగ్గుతున్న మిర్చి ధరల గురించి మరియు పంటలకు తెగుళ్ల నియంత్రణ చర్యల గురించి సమీక్షించారు.

రైతులతో పంటల వైవిధ్యాలను వివరించడం ద్వారా రైతుల ఆదాయం పెంచడంపై అవగాహన కల్పించేందుకు రైతు వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వివిధ పంటలకు కావాల్సిన నా ణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉండేలా తగిన చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు అధికంగా పం డించే వరి పంటను ఎగుమతి చేసేందుకు భారత ప్రభుత్వా నికి ఒక నివేదిక సమర్పించే విధముగా సరైన ప్రణాళికను సిద్దం చేయాలని మంత్రి సూచించారు. మార్కెట్లలో దళారీ వ్యవస్థ వలన పంటను తక్కువ ధరలకు అమ్ముకుని నష్టపోతున్నారు అట్టి దళారీ వ్యవస్థను నిర్మూలించి రైతుకు నష్టం వాటిల్లకుండా చూడాలనీ సూచించారు. వ్యవసాయ, ఉ ద్యోగ సంబంధిత సంఘాల ప్రతినిధులతో వారి సమస్యల పై సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ సంచాకులకు సూచించారు. ఇటీవల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమలో తలెత్తిన సమస్యలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా చేనేత విభాగం సంచాలకులు మాట్లాడుతూ ఉత్పత్తి చేస్తున్న పాలిస్టర్ వస్త్రాలకు ప్రభు త్వ పరంగా మార్కెటింగ్ సౌకర్యాలు ఎక్స్పోసెర్ విజిట్స్ వంటివి ఏర్పాటు చేసి మార్కెటింగ్ పై అవగాహన కల్పిస్తామని తెలిపారు. వస్త్రాల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని తెలిపారు. గనుల శాఖ సంచాలకులతో నిర్వహించిన సమీక్షలో ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలంలో జరిగిన అక్రమ గ్రావెల్,బెరైటీస్ తవ్వకాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, అక్కడ జరుగుతున్న మైనింగ్ మాఫియాను అరికట్టాలని,దోషులు ఎంతటి వారైనా వదలి పెట్టొద్దని మంత్రి అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News