Monday, April 29, 2024

సిసిసి ఆధ్వర్యంలో వ్యాక్సిన్ డ్రైవ్ పునః ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Vaccine drive start in CCC

కరోనా క్రైసిస్ ఛారిటి (సిసిసి) ఆధ్వర్యంలో సినీ కార్మికులకు వ్యాక్సిన్ డ్రైవ్‌ను పునః ప్రారంభించారు. ఈ వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ శంకర్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, సెక్రెటరీ దొరైలతో పాటు పలువురు సినీ టెక్నీషియన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “కరోనా క్రైసిస్ ఛారిటి ఆధ్వర్యంలో 24 క్రాప్ట్ వారికీ, ఫిలిం ఫెడరేషన్ వారందరికీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు వ్యాక్సిన్ వేయిస్తున్నాము. అలాగే జర్నలిస్ట్‌లకు కూడా వ్యాక్సిన్ ఇస్తున్నాం. చిరంజీవి చారిటబుల్ ట్రస్టు, అపోలో 24/7ల సహకారంతో ఈ వ్యాక్సిన్ డ్రైవ్ పునః ప్రారంభమైంది. ఈ వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమంలో అందరికీ వ్యాక్సిన్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. కనీసం రోజుకు ఐదారు వందల మందికి వ్యాక్సిన్ వేస్తాము. అలాగే తప్పకుండా 18 ఏళ్ళు నిండిన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలి”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News