Friday, May 3, 2024

ఆ టీకాలతో వీర్యకణాలు తగ్గవు

- Advertisement -
- Advertisement -

Vaccines no impact on male Fertility

 

ఫైజర్, మొడెర్నా వ్యాక్సిన్‌లపై అధ్యయనం

వాషింగ్టన్ : కొవిడ్ టీకాలతో పురుషుల శక్తి క్షీణత అనుమానాలు తలెత్తుతున్నాయి. ఫైజర్, మొడెర్నా టీకాలు తీసుకున్న వారిలో వీర్యకణాలు తగ్గే అవకాశం ఏమీ లేవని ఓ కీలక అధ్యయనంలో వెల్లడైంది. మగవారి పుంసత్వం లేదా వీర్యకణాల సంఖ్యపై ఫైజర్ , మాడెర్నా టీకాల నుంచి ఎటువంటి ముప్పు లేదని తేలిన అధ్యయనం ఇప్పుడు జర్నల్ జామాలో ప్రచురించారు. ఈ టీకాలు తీసుకోవడానికి ముందు ఆ తరువాత జరిపిన పరిశీలనలను బేరీజు వేసుకుని వీర్యకణాలు ఆరోగ్యకర స్థితిలో నిక్షేపంగానే ఉన్నాయని తేల్చారు. అయితే కేవలం 45 మంది మగవారు ( 18 50 ఏండ్ల లోపువారు) టీకాలు పూర్వపు అనంతర పరిస్థితిని సమీక్షించారు. అమెరికా ఇతర దేశాలలో చాలారోజులుగా టీకా తీసుకోవడానికి తటపటాయింపుల వెనుక ఈ వీర్యకణాల అంశం కూడా ఒకటిగా ఉంటూ వస్తోంది. ఈ టీకాలు తీసుకుంటే వీర్యకణాలు దెబ్బతిని తమ సంతానోత్పత్తి శక్తి సన్నగిల్లుతుందని, ఈ విధంగా సమాజంలో చులకన అవుతామనే భావనతో సతమతమవుతున్నారు. దీనిని గుర్తించి అమెరికాకు చెందిన మియామీ వర్శిటీ పరిశోధకులు ఈ అంశంపై సర్వే చేసి వెలువడ్డ అధ్యయనాలను శాస్త్రీయ పరిశోధనల పత్రికలకు పంపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News