Sunday, April 28, 2024

యువతి కిడ్నాప్ కేసు: గోవా బీచ్ లో నవీన్ రెడ్డి అరెస్టు..

- Advertisement -
- Advertisement -

డెంటిస్టు కిడ్నాప్ కేసులో కీలక నిందితుడు

గోవాలో అదుపులోకి తీసుకున్న ఆదిభట్ల పోలీసులు

నేడు హైదరాబాద్‌కు తరలింపు

కీలకంగా మారనున్న రిమాండ్ రిపోర్టు

తాను చేసింది తప్పేనని సెల్ఫీ వీడియోలో అంగీకారం?

హైదరాబాద్: దంత వైద్యురాలు వైశాలి కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిం దితుడు నవీన్ రెడ్డిని ఆదిభట్ల పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. అతడిని గోవా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. బుధవారం మీ డియా ముందుకు అతడిని ప్రవేశ పెట్టే అవకాశా లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైశాలి కిడ్నాప్ కేసును నగర పోలీసులు ఒక్క రోజులోనే ఛేదించారు. ఈ నెల 9న నవీన్ రెడ్డి అ తని స్నేహితురాలు వైశాలి ఇంటిపై దాడి చేసి ఆ మెను కిడ్నాప్ చేశాడు. వైశాలి కిడ్నాప్ కేసులో పో లీసులు ఇప్పటికే 21 మందిని అరెస్టు చేశారు. 9వ తేదీ నుండి నవీన్ పరారీలో ఉన్నాడు. ఈ క్రమం లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నవీన్ రెడ్డిని మంగళవారం గోవా లో అదుపులోకి తీసుకోగలిగారు. కాగా సెల్పీ వీడి యోలో తాను చేసింది తప్పేనని నిందితుడు నవీన్ రెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది. వైశాలి కిడ్నాప్ వెనుక చాలా బాధ ఉందని, దీని వల్ల తన ఫ్యామి లీ చాలా బాధినట్లు నవీన్ ఆ వీడియోలో వెల్లడించారని సోషల్ మీడియా ద్వారా వెల్లడైంది. . కాగా వైశాలి కిడ్నాప్ ప్రధాన సూత్రధారి అయిన నవీన్ రెడ్డి వద్ద దాదాపు 5 సెల్‌ఫోన్లను పోలీసులు స్వా ధీనం చేసుకున్నారు.

కీలకంగా మారనున్న రిమాండ్ రిపోర్టు..
ఈ కేసుకు సంబంధించి పోలీసులు విడుదల చేసి న రిమాండ్ రిపోర్టు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మా రింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించిన రి మాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాల ను ప్రస్తావించారు. గత ఏడాది బొంగులూరులో ని స్పోరట్స్ అకాడమీలో వైశాలితో నవీన్ రెడ్డికి పరిచయం ఏర్పడిందని పోలీసులు రిమాండ్ రి పోర్టులో పేర్కొన్నారు. ఈ సమయంలో వైశాలి నెంబర్ తీసుకొని ఆమె కు తరచూ ఫోన్లు, మేసేజ్ లు చేసేవాడని కొన్ని రోజుల తర్వాత నవీన్ రెడ్డి వైశాలి వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చాడని వెల్లడించింది.

అయితే తన తల్లిదండ్రులను అడగాలని వైశాలి నవీన్ రెడ్డికి చెప్పిందని వైశాలి తల్లిదండ్రులను ఒప్పించేందుకు నవీన్ రెడ్డి కూడా ప్రయత్నించారని పోలీసులు ఆ రిపోర్టులో పేర్కొన్నారు. కానీ నవీన్ రెడ్డికి వైశాలిని ఇచ్చి పెళ్లి చేసేందుకు వారు అంగీకరించలేదని, దీంతో వైశాలి కుటుంబంపై నవీన్ రెడ్డి కక్ష పెంచుకున్నారని రిమాండ్ రిపోర్టు పేర్కొంటోంది. వైశాలి పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తెరిచి డాక్టర్ వైశాలితో తాను ఉన్న ఫోటోలను వైరల్ చేశాడని పోలీసు రిమాండ్ రిపోర్టు చెబుతోంది. ఐదు మాసాల క్రితం వైశాలి ఇంటి ముందు స్థలాన్ని లీజుకు తీసుకున్నాడని, గణేష్ నిమజ్జనం సందర్భంగా నవీన్ రెడ్డి అతని స్నేహితులు హంగామా చేశారని, ఈ విషయమై వైశాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేశారని రిమాండ్ రిపోర్టు తెలుపుతోంది.

ఈ నెల 9వ తేదీన వైశాలికి నిశ్చితార్ధం ఉందని నవీన్ రెడ్డి తెలుసుకున్నాడని దీంతో వైశాలిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వివరించారు. తన అనుచరులు, టీ స్టాళ్లలో పనిచేసే సిబ్బందిని డాక్టర్ వైశాలి కిడ్నాప్ కోసం ఉపయోగించుకున్నారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. వైశాలి ఇంటి ముందున్న ఐదు కార్లను కూడా ధ్వంసం చేసినట్టుగా పోలీసులు వివరించారు. అంతేకాదు వైశాలి నివాసంలో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారన్నారు. పోలీసులు తమ కోసం గాలింపు చర్యలు చేపట్టారని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న నవీన్ రెడ్డి పారిపోయినట్టుగా పోలీసులు తెలిపారు. నల్గొండలో నవీన్ రెడ్డి అతని స్నేహితులు కారు దిగి పోయారని రిమాండ్ రిపోర్టు తెలిపింది. రుమాన్ అనే యువకుడు ఓ కారులో వైశాలిని హైద్రాబాద్ వైపునకు తీసుకు వచ్చినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News