Monday, April 29, 2024

ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల స్థానానికి 16 మంది పోటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికకు గడువు ముగిసింది. 16 మంది అభ్యర్థులు 28 నామినేషన్లను దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న జీవన్ రెడ్డి మూడు సెట్లు, బిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న నవీన్ రెడ్డి మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు మున్నూరు రవి, గవినోల్ల బలరాం రెడ్డి, పి సుమలత, ఎం శంకర్ నాయక్,, మహమ్మద్ రహీం ఖాన్, పిల్లేల శ్రీకాంత్, ఆర్ జీవన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా ఒక్కొక్క నామినేషన్ దాఖలు చేశారు. మరో బిఆర్‌ఎస్ అభ్యర్థిగా నగర కుంట లక్ష్మీ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు గడీల కుమార్ గౌడ్, ఎస్ కృష్ణ, విజయ్ మంగి, సుదర్శన్ గౌడ రెండు రెండు నామినేషన్లు దాఖలు చేశారు. భారతీయ జనతా పార్టీ నుండి ఒకరు కూడా నామినేషన్ దాఖలు చేయకపోవడం విశేషం. కాగా నామినేషన్ల పరిశీలన మంగళవారం జరగనుంది.
ఓటర్ల వివరాలు:  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లు మొత్తం 1439 మంది ఉన్నారు. ఇద్దరు ఎంపిలు, 14 మంది ఎమ్మెల్యేలు, 83 మంది జడ్పీటీసీలు, 888 మంది ఎంపీటీసీలు, 449 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఓటర్లుగా ఉన్నారు. 2021 లో ఉన్న మొత్తం ఓటర్ల కన్నా సంఖ్య కొంత తగ్గింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News