Sunday, May 5, 2024

నటుడు విజయ్‌కాంత్‌కు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

Vijayakanth admitted to hospital in Chennai

చెన్నై: కోలీవుడ్ ప్రముఖ నటుడు, డిఎండికె పార్టీ అధినేత విజయకాంత్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బుధవారం తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందింస్తున్నారు. కాగా, గతేడాది విజయ్ కాంత్ కోవిడ్-19 బారిన పడ్డారు. చికిత్స అనంతరం కెప్టెన్ విజయ్ కాంత్ ఆరోగ్యం కుదుటపడింది. గత కొన్నేళ్లుగా ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది. అతని ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. కాగా, అతని సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయటానికి ఆసుపత్రిలో చేరినట్లు అతని పార్టీ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అతను ఒకటి లేదా రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతాడని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆసుపత్రి నుండి పూర్తి వివరాలు ఇంకా రావాల్సిఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News