Tuesday, May 14, 2024

త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్న విజయశాంతి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ అగ్రనేతలతో చర్చలు
క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి

మనతెలంగాణ/హైదరాబాద్: సినీ నటి విజయశాంతి కాంగ్రెస్‌లో చేరికపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి క్లారిటీ ఇచ్చారు. బిజెపి కీలక నేత విజయశాంతి పార్టీలోకి రాబోతున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఢిల్లీ కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చలు జరిగాయని ఆయన తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో ఆమె అధికారికంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలే తెలంగాణలో అధికారంలోకి తీసుకువస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయన్నారు. డిసెంబర్ 3వ తేదీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని, డిసెంబర్ 9వ తేదీన తొలి కేబినెట్ భేటీ మీటింగ్ ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.

కొంతకాలంగా బిజెపి పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఫైర్ బ్రాండ్ విజయశాంతి త్వరలోనే పార్టీ మారునున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ చేపట్టే కార్యక్రమాలు, బిజెపి అగ్రనేతలు హాజరయ్యే సమావేశాలు, సభలకు సైతం ఆమె దూరంగా ఉంటున్నారు. పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వెళ్లగక్కుతూ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడుతున్నారు. దీంతో ఆమె బిజెపికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ వార్తలకు చెక్ పెడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News