Tuesday, April 30, 2024

వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణ కొత్త జిల్లాల పేర్లు తెలుసా?

- Advertisement -
- Advertisement -

వరంగల్ అర్భన్, వరంగల్ గ్రామీణ జిల్లాలను
హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్
అభ్యంతరాలు, వినతులకు నెలరోజుల గడువు
సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

Warangal urban-Warangal rural district new names

 

మనతెలంగాణ/హైదరాబాద్: వరంగల్ అర్భన్, వరంగల్ గ్రామీణ జిల్లాలను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల వరంగల్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు జిల్లాల పేర్లు, స్వరూపం మార్పును ప్రతిపాదించారు. హన్మకొండ, పరకాల రెవెన్యూ డివిజన్లతో ఉండే హన్మకొండ జిల్లాలో 12 మండలాలు ఉండనుండగా, వరంగల్, నర్సంపేట రెవెన్యూ డివిజన్లతో వరంగల్ జిల్లాలో 15 మండలాలు ఉంటాయని, ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాలు, వినతులకు నెలరోజులు గడువు ఇచ్చింది. నెల రోజుల్లోపు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ కలెక్టర్లకు అభ్యంతరాలు, వినతులు ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణ జిల్లాలనగానే రెండు జిల్లాల ప్రజలూ తరచూ గందరగోళానికి గురయ్యేవారు. దీంతో ఈ పేర్లను మార్చాలని నాలుగున్నరేళ్ల నుంచి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఇదే విషయాన్ని పలుమార్లు సిఎం దృష్టికి తీసుకొచ్చారు. గత నెల 21న వరంగల్ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి దీనికి సంబంధించి తన నిర్ణయాన్ని ప్రకటించారు. జిల్లాల పేర్ల మార్పునకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడడంపై పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల సౌకర్యార్ధం ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు.

హన్మకొండ జిల్లాలోని మండలాలు ఇలా….

హన్మకొండ, ఖాజీపేట, ఐనవోలు, హసన్‌పర్తి, వేలేరు, ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, పరకాల, నడికుడ, దామెర.

వరంగల్ జిల్లాలోని మండలాలు

వరంగల్, ఖిలా వరంగల్, గీసుకొండ, ఆత్మకూర్, శాయంపేట, వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, సంగెం, నర్సంపేట, చెన్నరావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్, నెక్కొండ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News