Wednesday, May 1, 2024

శ్రీశైలం నిండుకుండ కాదు సగమే!

- Advertisement -
- Advertisement -

పూడికమట్టిలో ప్రాజెక్టు మునక

ప్రతి 3టిఎంసిల బురద మేట
ప్రాజెక్టు ప్రారంభంలో నీటి నిల్వ సామర్థ్ధం
308 టిఎంసిలు, 2022 188
టిఎంసిలు నిపుణుల కమిటీ తాజా
నివేదికలో 120 టిఎంసిలు పూడికపాలు
పూడిక తొలగింపు సమస్యపై మేథోమధనం
డ్రెడ్జింగ్ విధానం తాత్కాలికమేనా?
జపాన్ విధానమే శరణ్యమా?

మన తెలంగాణ/హైదరాబాద్: కరువు ప్రాంతాలను సశ్యశ్యామలం చేస్తూ వేలాది కోట్ల రూపాయలు వ్యయం చేసి నిర్మిస్తున్న ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. పదికాలాల పాటు తాగు,సాగు నీటి కొరతను తీర్చాల్సిన ప్రాజెక్టులు శరవేగంగా పూడికపాలవుతున్నాయి . కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలోనే అత్యంత వేగంగా పూడికతో నిండిపోతున్న జలాశయాల్లో శ్రీశైలం ప్రాజెక్టు మొదటి వరుసలో ఉండడం అత్యంత ఆందోళనకరంగా మారింది. దక్షిణ ఏకంగా 36 ప్రాజెక్టులు బురదమేటలతో నిండిపోయి పూడిక సమస్యతో ఉనికినే ప్రశ్నార్థకం చేసుకుంటున్నాయి. కృష్ణానదిపై తెలుగు రాష్ట్రాలకు గుండెకాయలా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో పూడిక మరింత ఆందోళన గొలుపుతోంది. ప్రాజెక్టు నిర్మించి నాలుగు దశాబ్దాలైన నిండకముందే ప్రాజెక్టులో బురదమేటలు పేరుకుపోయి నీటినిలువ సామర్థం మునకేస్తోంది. 1983-84నాటికి నిర్మాణం పూర్తి చేసుకున్న శ్రీశైలం ప్రాజెక్టును నాటి ప్రధాని ఇందిరాగాంధీ జాతికి అంకితం చేశారు.ప్రారంభం నాటికి 308 నీటినిలువ సామర్థం ఉన్న శ్రీశైలం జలాశయం శరవేగంగా పూడిక పడుతూ వస్తోంది. కేంద్ర జల సంఘం తాజా నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టులో నీటి నిలువ సామర్థ్దం 188 టిఎంసిలకు పడిపోయింది. జలాశయంలో 120 టిఎంసిల నీటి నిలువ సామర్థ్ధం మేరకు పూడికమట్టి పేరుకుపోయింది. ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత 38ఏళ్ల కాలంలో ఏటా సగటున 3.15టిఎంల మేరకు పూడిక మేటలు పడుతు రిజర్వాయర్ ఈ మేరకు నీటి సామర్ధాన్ని కోల్పోతూ వస్తోంది.

ఇదే పరిస్థితుల్లో పూడిక మట్టి మేటలు పడుతూ వస్తే 2050 నాటికి శ్రీశైలం రిజర్వాయర్ చుక్కనీటిని కూడా నిలుపుకునే సామర్థ్ధం లేక ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని తెలుగు రాష్ట్రాల్లోని నీటి రంగం నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంవైపు ఉన్న కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం,తెలంగాణ ప్రాంతంవైపు ఉన్న ఎడమగట్టు జల ఉత్పత్తి కేంద్రాలపైనా పూడిక ప్రభావం పడుతుందంటున్నారు. జలాశయం నుంచి నీటిని టర్బైన్లలోకి తీసుకుపోయే సొరంగ మార్గాలు, వాటి కుడ్యాలు కూడా దెబ్బతింటాయని చెబుతున్నారు. టర్బైన్లకు కూడా సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు. సిమ్లాలోని రామన్‌పూర్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. 412 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థం ఉన్న రామన్‌పూర్ ప్రాజెక్టులో పూడిక పేరుకుపోయి ఏకంగా విద్యుత్ ఉత్పత్తినే నిలిపివేయాల్సి వచ్చింది. హైడల్ ప్రాజెక్టు పరిసరాల్లో పూడిక తొలగించాకే తిరిగి ఇది ఉపయోగంలోకి వచ్చింది.

శ్రీశైలం మనుగడను బద్దలు కొట్టిన హైడ్రోగాఫిక్ సర్వే !

శ్రీశైలం ప్రాజెక్టు మనుగడను హైడ్రోగ్రాఫిక్ సర్వే బద్దలుకొట్టింది. వాటర్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం దేశంలోని ఏ ప్రాజెక్టులోనైనా ప్రతి ఆరేళ్లకు ఒకసారి ఆ ప్రాజెక్టులో నీటి నిలువ సామర్థ్ధాన్ని లెక్కించాల్సి ఉంది. 2011లో శ్రీశైలం ప్రాజెక్టు జలాశయంలో సర్వే నిర్వహించి విడుదల చేసిన నివేదిక ప్రకారం అప్పటికే రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్ధం 93 తగ్గిపోయినట్టు వెల్లడైంది. కేంద్ర జల సంఘం ఇటీవల ముంబైకి చెందిన 12 మంది నిపుణులతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి సామర్థ్ధంపై శాస్త్రీయ పరమైన అధ్యయనం చేయించింది. అత్యంత అధునాతన సాంకేతిక పరికరాల సాయంతో ప్రత్యేక బోట్లపై రెండు వారాల రిజర్వాయర్‌లో హైడ్రోగాఫీక్ సర్వే నిర్వహించారు. జలాశయంలో ఎంతమేరకు పూడికమేటలు వేసిందన్నది అధ్యయనం చేశారు. నీటి సామర్థ్ధం 188 తగ్గినట్టు నిర్ధారించారు. కృష్ణానదీ ప్రాంతంలో ఉన్న నల్లమల అడువులను విచక్షణా నరికివేస్తుండడం, వర్షాల సమయంలో అడువుల్లోని మట్టి కోతకు గురువతుండడం కూడా రిజర్వాయర్ పూడికకు ఒక కారణంగా తేల్చారు.

డ్రెడ్జింగ్‌తో పూడిక తొలగింపు సాధ్యమేనా?

గుండె పేరుకుపోయిన కొవ్వును తొలగించే ఆధునాతన చికిత్సావిధానాలు అందుబాటులోకి వస్తే రావచ్చునేమోగాని రిజర్వాయర్లలో పూడికమట్టిని తొలగించడం మాత్రం ఇప్పట్లో సాధ్యమేనా అన్న సందేహాలు నిపుణుల మెదళ్లను తొలుస్తున్నాయి. జలాశయంలో పూడికమట్టిని తొలగించేందుకు డ్రెడ్జింగ్ విధానం ఒక్కటే అందుబాటులోవుంది. ఈ విధానంలో రిజర్వాయర్ అడుగున ఉన్న పూడిక భాగంలోకి మట్టిని కలియిబెట్టే భారీ మిషన్లను పంపుతారు. కవ్వంలా ఇవి ఒడ్రుమట్టిని చిలికేస్తాయి. భారీ పంపుల సాయంతో మట్టిమేటలను రిజర్వాయర్ నుంచి బయటకు పంపుతారు. ఇలా బయటకు చేర్చిన ఒండ్రుమట్టినంతా పొలాలకు తరలించుకుని నేలను సారవంతం చేసుకొవచ్చు. అంతేకాకుండా బ్రిక్స్, పెంకులు వంటి నిర్మాణ రంగాలకు ముడిసరుకుగా వినియోగించుకోవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయ్ నల్లమల అడవుల్లో ఒదిగిఉన్నందున రిజర్వాయ్‌లోని మట్టిని బయట మెరక ప్రాంతాలకు తరలించటం అత్యంత శ్రమతో కూడిన పనిగా చెబుతున్నారు. శ్రమకోర్చి తరలిస్తే మళ్లీ భారీ వర్షాలు వరదలకు మట్టి వరదనీటిలో కలిసి చివరకూ మళ్లీ శ్రీశైలం జలాశయంలోకే చేరుతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. బేసిన్ బయటి ప్రాంతాలకు తరలిస్తే ఆ బేసిన్ ప్రాంత ప్రాజెక్టులకు కూడా ఇదే సమస్య ఉత్పన్నం అవుతందంటున్నారు.

జపాన్ విధానమే శరణ్యమా!

ప్రధాన ప్రాజెక్టులకు చెందిన రిజర్వాయర్లను పూడిక సమస్యనుంచి కాపాడుకునేందుకు జపాన్ ప్రభుత్వం ప్రత్యేక విధానం అమలు చేస్తోంది. ఈ విధానం ద్వారా మంచి ఫలితాలు కూడా వస్తున్నట్టు నీటిపారుదల రంగం నిపుణులు చెబుతున్నారు. జపాన్‌లో అక్కడి ప్రాజెక్టుల పరిరక్షణ సంస్థ ద్వారా ప్రధాన జలాశయానికి ఎగువన ఒక్కొక్కటి 15మీటర్ల ఎత్తులో పూడికను నిల్వ చేసే చిన్నచిన్న ప్రాజెక్టులు నిర్మించారు. ఇవి నదిలో వరద నీటి ప్రవాహపు వేగాన్ని తగ్గిస్తాయి. అంతే కాకుండా వరదల కొట్టుకువచ్చే మట్టని ఈ ప్రాజెక్టుల్లోనే నది అడుగుభాగానికి చేరుకుని అక్కడే పేరుకునేలా చేస్తాయి. దీంతో వదరనీటి ప్రవాహం ద్వారా ప్రధాన ప్రాజెక్టులోకి చేరుకునే మట్టి శాతం తగ్గిపోతుంది. ప్రధాన రిజర్వాయర్‌కు ఎగువన నిర్మించిన చిన్న చిన్న ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన మట్టిని పూడిక సామర్ధం ఆధారంగా వేసవిలో పూర్తిగా తొలగించే అవకాశం వుంటుందని చెబుతున్నారు. ప్రధాన జలాశయాల్లోకి వరదనీటితో కలిసి చేరే మట్టిలో 10శాతం తగ్గించగలిగితే ఆ ప్రాజెక్టు జీవితకాలాన్ని 20ఏళ్లు పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News