Sunday, April 28, 2024

జిఎస్‌టి పరిహారంలో ఆప్షన్లు లేవు

- Advertisement -
- Advertisement -

We Will fight for GST Arrears: Minister Harish Rao

 

కేంద్రం ప్రతిపాదించిన రెండింటికి తెలంగాణ వ్యతిరేకం

నిర్మలా సీతారామన్‌కు సిఎం కెసిఆర్ లేఖ రాశారు
కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని చట్ట ప్రకారం రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాల్సిందే
కరోనా పేరుతో రూ.1.35 లక్షల కోట్ల పరిహారాన్ని కేంద్రం ఎగ్గొట్టాలని చూస్తోంది పార్లమెంట్‌లో నిలదీస్తాం మీడియా సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్: జిఎస్‌టి పరిహారం విషయంలో ఆప్షన్స్ లేవే లేవని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ మే బాధ్యత తీసుకుని చట్టం ప్రకారం రాష్ట్రాలకు చెల్లించాలని ఆర్థిక శాఖ మంత్రి టి. హరీశ్‌రావు స్పష్టం చేశారు. కేంద్రం ప్ర తిపాదించిన రెండు ఆప్షన్లను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీ తారామన్‌కు లేఖ కూడా రాశారన్నారు. పార్లమెంట్‌లో చేసిన జిఎస్‌టి చట్టం ప్రకా రం 14 శాతం గ్రోత్ రేట్ మీద పరిహారం ఇస్తానన్నారు. దాన్ని పది శాతానికి ఎలా తగ్గిస్తారని ప్రశ్నించారు. కేంద్రం జిఎస్‌టి పరిహారం ఎగ్గొట్టాలని చూస్తోందని విమర్శించారు. అలా చేస్తే పార్లమెంట్‌లో నిలదీస్తామన్నారు.

ఢిల్లీ, చత్తీస్ ఘడ్, పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో హరీశ్‌రావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వీరంతా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు మంత్రి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆప్షన్-1, ఆప్షన్ -2 కాదు. చట్టానికిలోబడి పూర్తి పరిహారం చెల్లించాల్సిందేనని చెప్పారన్నారు. ఈ అధికారం పార్లమెంట్‌కు తప్ప ఎవరికి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చట్టంలో ప్రకారం జిఎస్‌టి పరిహారం రూ.3 లక్షల కోట్ల కు గాను రూ.లక్షా 65 వేల కోట్లకు తగ్గించడా న్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.

యాక్ట్ ఆఫ్ గాడ్ పేరిట, కరోనా పేరిట రూ. లక్షా 35వేల కోట్ల నష్టపరిహారాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూస్తోందన్నారు. చట్టంలో కోవిడ్ అని గాని, ప్రకృతి వైపరిత్యాలని గాని ఎలాంటి విభజనకు అవకాశం లేదన్నారు. కేంద్రం విపత్కర పరిస్థితుల్లో ఇచ్చిన మాట ప్రకారం, చట్ట ప్రకారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పన్ను లు కట్టే వాళ్లు కొవిడ్ వల్ల పన్ను కట్టం అంటే రాష్ట్రం దేశం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రాలకు ఇవ్వడం అంటే రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడటమనని, అది దేశానికి ఇవ్వడమేనన్నారు. ఇందుకోసం కేంద్రమే రుణం తీసుకు ని పూర్తి స్థాయిలో రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలన్నారు. ఎగ్గొట్టడంపై అడ్వకేట్ జనరల్‌ను కేంద్రం సంప్రదించినప్పటికీ మొత్తం నష్టపరిహారం రాష్ట్రాలకు చెల్లించాలని చెప్పారన్నారు. నైతికంగా చూసినా, న్యాయపరంగా చూసినా కేంద్రం జిఎస్‌టి పూర్తి పరిహారం చెల్లించాల్సిందేనన్నారు.

నాలుగు నెలల్లో రూ.8 వేల కోట్లు లాస్
జిఎస్‌టి అమల్లోకి వచ్చి 3 ఏళ్లు అయిందని, జిఎస్‌టి డబ్బులు, ఐజిఎస్‌టి డబ్బులను మిగిలితే కన్సాలిడేట్ ఫండ్‌లో జమ చేసుకున్నారు. ఇప్పుడు తగ్గితే రాష్ట్రాలను అప్పులు తీసుకోమని చెబుతున్నారన్నారు. కరోనా వల్ల అంచనా మేర కు రూ. 3 లక్ష కోట్ల పరిహారం రాష్ట్రాలకు ఇవ్వకుండా, కేవలం రూ. లక్షా 65వేల కోట్లు మాత్ర మే ఇస్తామంటున్నారన్నారు. దీన్ని తెలంగాణ రాష్ట్రం ఏ మాత్రం అంగీకరించదన్నారు. తెలంగాణ రాష్ట్రం నాలుగు నెలల్లో 34 శాతం అంటే రూ. 8వేల కోట్ల ఆదాయం కోల్పోయిందన్నా రు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రం పెద్ద న్న పాత్ర పోషించి, రాష్ట్రాలకు నిధులు విరివిగా ఇవ్వడం ద్వారా ఆదుకోవాలన్నారు. రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన జిఎస్‌టి సెస్‌ను ఎగ్గొట్టాలని చూస్తోందన్నారు.

ఆనాడు తర్జన భర్జన పడ్డాం
జిఎస్‌టిలో చేరడం వల్ల తెలంగాణ నష్టపోతుందని ఆనాడు తర్జన భర్జన పడ్డామని, 2016 2017లో తెలంగాణ రాష్ట్రం 22 శాతం గ్రోత్ రెట్ తో ముందుకు పోతోందన్నారు. తెలంగాణ జిఎస్‌టిలో చేరకపోతే రూ.25 వేల కోట్లు అదనంగా వచ్చేవన్నారు. జిఎస్‌టిలో చేరి సెస్ రూపంలో రూ. 18 వేల 32 కోట్ల రూపాయలు చెల్లిస్తే, కేవలం రూ. 3200 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయన్నారు. జిఎస్‌టి 7, 8 సమావేశాల్లో అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా సెస్ తగ్గినా, కేంద్రమే బాధ్యత తీసుకుని రాష్ట్రాలకు చెల్లిస్తామని హామీ ఇచ్చారన్నారు.

అప్పటి యూపిఎ ప్రభుత్వం, ఆర్థిక మంత్రి చిదంబరం సిఎస్‌టిలో చేరినందుకు తెలంగాణ కు రావాల్సిన రూ.3647 కోట్లను ఇవ్వలేదని, నష్టపరిహారం ఇస్తామని చెప్పారన్నారు. రూ. 5604 కోట్లకు గాను యూపిఎ కేవలం రూ.1957 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. అప్పటి యూపిఎ ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు హామీ ఇచ్చి మాట తప్పిందన్నారు. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కూడా అదే పని చేస్తారేమో అని జిఎస్‌టి ప్రాథమిక చర్చల్లో తెలంగాణ తరపున ప్రశ్నించిందన్నారు. దేశ విస్తృత ప్రయోజనాల నిమిత్తం జిఎస్‌టితో తెలంగాణకు నష్టమని తెలిసినా.. చేరాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి కేంద్రానికి అవకాశాలు ఎక్కువ. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు, కేంద్రానికి సమాన హక్కులు ఉండాలన్నారు.

ఎఫ్‌ఆర్‌బిఎం కేంద్రానికే ఎక్కువ
ఎఫ్‌ఆర్‌బిఎంలో కేంద్రం ఐదు శాతం అప్పులు తీసుకోవచ్చునని, కాని రాష్ట్రాలకు 3 శాతానికే పరిమితం చేశారన్నారు. కేంద్రానికి సెస్ రూపంలో, ఎఫ్‌ఆర్‌బిఎం కింద నిధులు వస్తా యి. అనేక రూపంలో నిధులు అందుతాయన్నా రు. చట్టానికి అనుగణంగా ఇవ్వాల్సిన సెస్ ఇవ్వకుండా, అప్పులు తీసుకోమనడాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తుందన్నారు. క్రూడ్ ఆయిల్ తగ్గి న టైంలో కేంద్రం పెట్రోల్, డిజీల్ మీద లీటరు మీద 13 రూపాయలు పెంచింది దీనివల్ల లక్ష కోట్ల రూపాయలు వచ్చాయి. సర్ చార్జిలు, సెస్ రూపంలో కేంద్రానికి 16 శాతం ఆదాయం వస్తోందన్నారు. రాష్ట్రాలకు ఆదాయ పరిమితు లు ఉన్నాయి. కేంద్రం అనుమతితోనే రాష్ట్రాలు ఏదైనా చేయాల్సి ఉందని ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాలకు రావాల్సిన సెస్‌ను ఇవ్వాల్సిందేన్నారు. లేకపోతే పార్లమెంట్‌లో గట్టిగా నిలదీస్తామన్నారు.

We Will fight for GST Arrears: Minister Harish Rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News