Sunday, May 5, 2024

సొంతింటికే కన్నం వేసిన భార్య… అరెస్టు

- Advertisement -
- Advertisement -

Thieft

 

చెన్నై: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోరు అంటారు కానీ… సొంత ఇంట్లో బంగారం దొంగతనం చేసిన ఇల్లాలును పోలీసులు పట్టుకున్న సంఘటన తమిళనాడులోని తూత్తుకుడి తాలముత్తునగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విన్సెంట్ (59), తన భార్య ఝాన్సీతో కలిసి పెరియసెల్వం నగర్‌లో నివసిస్తున్నారు. ఈ దంపతులకున్న ఇద్దరు కుమార్తెలకు పెళ్లిలు చేశారు. గురువారం రాత్రి తన ఇంట్లో వంద సవర్ల నగలు, రూ.20 వేలు దొంగలు ఎత్తుకెళ్లారని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఝాన్సీని విచారణ జరుపుతుండగా పొంతనలేని సమాధానం ఇస్తుండడంతో అదుపులోకి పోలీసులు తనదైన శైలిలో విచారించగా చేసిన తప్పును ఒప్పుకుంది. ఆమెను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

Wife arrested in theft case in Tamilnadu
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News