Monday, April 29, 2024

మనమంతా గర్వపడే గొప్ప సినిమా ‘వైల్డ్‌డాగ్’: చిరంజీవి

- Advertisement -
- Advertisement -

కింగ్ నాగార్జున హీరోగా అషిషోర్ సాల్మన్ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. తాజాగా విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఎన్‌ఐఏ ఆఫీసర్ ఏసీపి విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటనపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. కాగా ఇటీవల ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “మనమంతా గర్వపడే గొప్ప సినిమా ఇది. ఇందులో సాంగ్స్ ఉండవు, రొమాంటిక్ సీన్స్ ఉండవు. నాగ్ సినిమా అంటే ఇవన్నీ ఊహిస్తాం కానీ అవేవీ ఉండవు. కాబట్టి డ్రైగా ఉంటుందని అనుకున్నా. కానీ ఈ సినిమా చూసేటప్పుడు ఆద్యంతం ఉత్కంఠగా అనిపించింది. సీట్ ఎడ్జ్‌లో కూర్చొని ఈ సినిమా చూశానని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రయోగాత్మక సినిమాలు చేసే నాగార్జున ఇలాంటి సినిమా చేయడం చాలా గర్వంగా ఫీల్ అయ్యా. తెలుగు వాళ్లు కూడా ఇలాంటి సినిమాలు తీయగలరని నిరూపించిన సినిమా ఈ ‘వైల్డ్ డాగ్’. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉన్న వార్ సీన్స్, గన్ ఫైట్స్ బాగా నచ్చాయి”అని అన్నారు.

కింగ్ నాగార్జున మాట్లాడుతూ “చిరంజీవి నాకు ఫోన్ చేసి ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా అంటూ పొగిడారు. ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఫీల్ అయ్యా”అని చెప్పారు. చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ “ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసినప్పుడు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ మేకర్స్ ఆఫ్ క్షణం, ఘాజీ అని వేసుకున్నాం. కానీ చిరంజీవి కాల్ చేశాక ఇక తదుపరి సినిమాకు మేకర్స్ ఆఫ్ క్షణం, ఘాజీతో పాటు వైల్డ్ డాగ్ అని వేసుకుంటామనే నమ్మకం వచ్చింది”అని పేర్కొన్నారు. డైరెక్టర్ అహిషోర్ సాల్మన్ మాట్లాడుతూ చిరంజీవి ఈ సినిమా చూసి బాగుందని ట్వీట్ చేయడం ఆనందాన్నిచ్చిందని అన్నారు.

Wild Dog Movie Unit Press Meet in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News