Tuesday, May 21, 2024

క్రీడల్లో గెలుపోటములు సహజం

- Advertisement -
- Advertisement -
  • విజేతలకు బహుమతులను అందజేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

మెదక్: క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహానికి గురికాకుండా గెలుపొందేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. హవేళిఘనపూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆద్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా మంగళవారం టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడుతాయని అన్నారు.

క్రీడల అభివృద్ధ్దికి ప్రభుత్వం ప్రాధాన్యతమిస్తుందని ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే ఆటల పట్ల ఆసక్తిని పెంపొందించుకుని, నైపుణ్యంతో క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు, మానసిక ఉల్లాసం వృద్ధ్ది చెందుతుందన్నారు. అదేవిధంగా గెలుపోటములను సమానంగా స్వీకరించాలని కోరారు. గెలవలేనన్న ఆశ లేనివాడు ఆటకు ముందే ఓడిపోతాడని, ప్రతి క్రీడాకారుడు పట్టుదలతో ఆడాలని సూచించారు. ఈ కార్యక్రమ ంలో ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు మాణిక్‌రెడ్డి, సుల్తాన్‌పూర్ గ్రామ సర్ప ంచ్ కత్రోత్ రేణుక రమేష్, తొగిట సర్పంచ్ శ్రీహరి, నాయకులు మ్యాకల సాయిలు, రామచంద్రరెడ్డి, సంతోష్, పురం శంకర్, చందర్, సుభాష్, కిష్టయ్య, నర్సయ్య, పోచయ్య, వెంకట్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News