Friday, May 3, 2024

రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

సిద్దిపేట అర్బన్: రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల గురించి దుబ్బాక, హుస్నాబాద్, జిల్లాలోని జనగాం, మానకొండూరు నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రంలో మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. 3న తెలంగాణ రైతు దినోత్సవం అన్ని వ్యవసాయక్లస్టర్లలోని రైతు వేదికలలో తెలంగాణ రైతు దినోత్సవం నిర్వహించాలి 4న సురక్ష దినోత్సవం, 5న విద్యుత్ విజయోత్సవం, 6న తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం నిర్వహించాలి 7న సాగునీటి దినోత్సవం, 8న చెరువుల పండుగ, 9న తెలంగాణ సంక్షేమ సంబరాలు,10న తెలంగాణ సుపరిపాలన దినోత్సవం, 11న తెలంగాణ సాహిత్య దినోత్సవం,12న తెలంగాణ రన్, 13న మహిళా సంక్షేమ దినోత్సవం 14న తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం, 15న తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం, 16న తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం, 17న తెలంగాణ గిరిజన ఉత్సవం, 18న తెలంగాణ మంచినీళ్ల పండుగ,19న తెలంగాణ హరితోత్సవం, 20 తెలంగాణ విద్య దినోత్సవం, 21న తెలంగాణ ఆధ్మాత్మిక దినోత్సవం, 22న తెలంగాణ అమరుల సంస్మరణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరి సమన్వయంతో ముందస్తు ప్రణాళికతో ప్రజలను భాగస్వాములను చేసి సిఎం కెసిఆర్ ఆశించిన విధంగా రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అదేశాల మేరకు విజయవంతంగా నిర్వహించాలన్నారు. అనంతరం జడ్పీ చైర్మన్ రోజా శర్మ మాట్లాడుతూ తెలంగాణ పండగలను తలపించేలా ఉత్సవాల్లో ప్రజలు ఉత్సహంగా పాల్గొనేలా ప్రచారం కల్పించాలన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిర్వహించే కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు అందరిని బాగస్వాములను చేయాలన్నారు. నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఏ పీడి చంద్రమోహన్ రెడ్డి, డిఎఓ శివప్రసాద్, డిపిఓ దేవకిదేవి, డిఎంహెచ్‌ఓ కాశీనాథ్, డిఎప్‌ఓ శ్రీనివాస్, జడ్పీ సిఈఓ రమేశ్, మున్సిపల్ చైర్మన్లు , వివిధ శాఖల జిల్లా అధికారులు, నియోజక వర్గ పరిధిలోని మండలాల ఎంపిపిలు, జడ్పిటిసిలు, ఎంపిడిఓలు, ఎంపిఓలు , విద్యుత్ శాఖ ఎఈలు, ఐకెపి ఎపిఎంలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News