Saturday, April 27, 2024

కంగనా పద్మశ్రీని రద్దు చేయండి

- Advertisement -
- Advertisement -
Withdraw Kangana Ranaut Padma Shri
రాష్ట్రపతికి మహిళా నేత లేఖ

న్యూఢిల్లీ : నటి కంగనా రనౌత్ పద్మశ్రీని వెంటనే వెనకకు తీసుకోవాలని ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మాలీవాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఓ లేఖ రాశారు. దేశ స్వాతంత్య్రాన్ని , సిద్ధింపచేసిన మహనీయుల త్యాగాలను కించపరిచే విధంగా కనౌత్ వ్యాఖ్యలకు దిగారని, ఆమెకు ప్రకటించిన జాతీయ పురస్కారాన్ని రద్దు చేయాల్సి ఉందని, లేకపోతే స్వతంత్య్రాన్ని అవమానించినట్లు అవుతుందని ఈ లేఖలో డిసిడబ్లు అధినేత్రి తెలిపారు. 1947లో వచ్చింది స్వాతంత్య్రం కాదని, అది యాచించి తెచ్చుకున్నదని, 2014లోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని రనౌత్ తెలిపారు. పరోక్షంగా ప్రధానిగా మోడీ అధికారంలోకి వచ్చిన ఘట్టమే స్వాతంత్ర దశ అని వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్రస్థాయి విమర్శలు రగులుకున్నాయి.

దేశపు అత్యున్నత స్వాతంత్య్ర సమరయోధులు, ఎందరో మహానుభావుల ఆత్మలు క్షోభించేరీతిలో కంగనా వ్యాఖ్యలు ఉన్నాయని రాష్ట్రపతికి పంపిన లేఖలో మాలీవాల్ తెలిపారు. తనను మహారాణి అనుకుంటున్నట్లుగా వ్యవహరిస్తున్న ఈ క్వీన్ యాక్టర్ పురస్కారం రద్దుతో పాటు ఆమెపై దేశద్రోహపు అభియోగాలతో కేసు విచారించాల్సి ఉందని విన్నవించుకున్నారు. ఎందరో మహనీయుల త్యాగనిరతితో దేశానికి బ్రిటిష్ పాలకుల ఇనుపసంకెళ్ల నుంచి విముక్తి దక్కింది. ఈ మహత్తర ఘట్టాన్ని దెబ్బతీస్తూ మాట్లాడి , కోట్లాది మంది భారతీయుల మనోభావాలను కించపర్చిన నటిపై వెంటనే కేసు నమోదు చేయాల్సి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News