Monday, May 6, 2024

ప్రొఫెసర్ హరగోపాల్ పై పెట్టిన ఊపా కేసును వెంటనే ఉపసంహరణ చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి

హైదరాబాద్ : ప్రొఫెసర్ హరగోపాల్, సంధ్య, విమలక్క, ప్రొఫెసర్ కాసిం, హైకోర్టు రిటైర్డ్ జడ్జి భరద్వాజ మరియు 152 మందిపై ములుగు పోలీస్ స్టేషన్లో ఊపా కేసులు పెట్టారని, ఇది అన్యాయమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. రాజ్యాలే లేనప్పుడు రాజ ద్రోహం కేసులు ఎందుకు పెడతారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకు భిన్నంగా కేసులు పెట్టడం దుర్మార్గమని, ఇది పౌర హక్కులను కాలరాయడమే అవుతున్నదని అన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకులపై ఎవరు ఊపా కేసు నమోదు చేశారో సమగ్రమైన విచారణ జరిపి, ప్రభుత్వం చొరవ తీసుకొని కేసులను ఎత్తివేయాలని చాడ వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వారు ఎలాంటి నేరాలకు పాల్పడలేదని, వాస్తవాలను మాత్రమే సమాజానికి తెలియజేశారని వారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News