Wednesday, May 8, 2024

ప్రపంచకప్ ఫైనల్: తడబడిన టీమిండియా.. ఆస్ట్రేలియా టార్గెట్ 241 పరుగులు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ లో టీమిండియా బ్యాట్స్ మెన్లు తడబడ్డారు. ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో 240 పరుగులకే పరిమితమయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ ఆదిలోనే గిల్(4) వికెట్ కోల్పోయినా.. కెప్టెన్ రోహిత్ శర్మ(47) బౌండరీలతో ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే, భారీ షాట్ ఆడబోయి రోహిత్ పెవిలియన్ కు చేరడంతో టీమిండియా ఒత్తడిలో పడింది. ఈ క్రమంలో కోహ్లీ(54), రాహుల్(66)లు బాధ్యతగా ఆడుతూ ముందుకు తీసుకెళ్లారు.

అయితే, ఆసీస్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ బంతులో చెలరేగడంతో డిఫెండ్స్ కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్ల ధాటికి క్రీజులో నిలిచేందుకు కష్టపడ్డారు. వీరిద్దరూ ఔట్ అయిన తర్వాత లోయర్ అర్డర్ బ్యాట్స్ మెన్లు కూడా చెత్తులేత్తేశారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా, హజల్ హుడ్, కమిన్స్ లు చెరో రెండు వికెట్లు.. జంపా, మాక్స్ వెల్ లు ఒక్కో వికెట్ పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News