Sunday, May 12, 2024

పోరాడుతున్న భారత్..

- Advertisement -
- Advertisement -

పోరాడుతున్న భారత్
ఆశలన్నీ కోహ్లి, రహానెపైనే
రసవత్తరంగా డబ్లూటిసి ఫైనల్ సమరం
లండన్: భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న డబ్లూటిసి ఫైనల్ సమరం ఆసక్తికరంగా సాగుతోంది. 444 పరుగుల క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఇక ఆదివారం చివరి రోజు విజయం సాధించాలంటే భారత్ మరో 280 పరుగులు చేయాలి. ఆఖరి రోజు బౌలర్లకు సహకరించే అవకాశాలు అధికంగా ఉండడం టీమిండియాకు ఇబ్బందికర అంశంగానే చెప్పాలి. ఇక క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మెరుపు ఆరంభం లభించింది. ఓపెనర్లు, శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మలు ధాటిగా ఆడారు. అయితే 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన గిల్‌ను బొలాండ్ వెనక్కి పంపాడు.

దీంతో 41 పరుగుల వద్ద భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. ఇక ధాటిగా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ 7 ఫోర్లు, సిక్స్‌తో 43 పరుగులు చేసి ఔటయ్యాడు. చటేశ్వర్ పుజారా 5 బౌండరీలతో 27 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక కీకల ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లి 7 ఫోర్లతో 44 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. రహానె 20 (నాటౌట్) అతనికి అండగా ఉన్నాడు. చివరి రోజు భారత్ ఆశలన్నీ వీరిద్దరిపైనే నిలిచాయి. అంతకుముందు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 270 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News