Monday, May 6, 2024

26న యడ్డీ రాజీనామా!

- Advertisement -
- Advertisement -

 

రాజీనామానా వార్తలు ఊహాగానాలే
నా సారధ్యంలోనే తిరిగి 2023 ఎన్నికలకు
ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రకటన
ఢిల్లీ పెద్దలతో వరుస భేటీలు
26న బిజెపి శాసనసభాపక్షం భేటీకి పిలుపు, అదే రోజు రాజీనామా?

న్యూఢిల్లీ/బెంగళూరు : తాను రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప తోసిపుచ్చారు. దేశ రాజధానికి కర్నాటక సిఎం రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు రావడం, కీలక నేతలతో సుదీర్ఘ చర్చలు జరపడం వంటి పరిణామాలు జరిగాయి. దీనితో ఆయన పదవికి రాజీనామా చేస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. అయితే ఇవి అసత్య వార్తలు అని, వట్టి ఊహాగానాలే అని సిఎం తేల్చిచెప్పారు. ఈ నెలతో యడ్యూరప్ప పదవీకాలానికి రెండేళ్లు పూర్తి అవుతుంది. పలు కారణాలతో ఆయనను సిఎం పదవి నుంచి తొలిగిస్తారని చాలా రోజులుగా పార్టీవర్గాలలో ప్రచారం జరుగుతోంది. తాను ఇక్కడికి వచ్చి పార్టీ నేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నడ్డాలతో మాట్లాడానని, వారు పార్టీని మరింత బలోపేత చేయాలని, దక్షిణాదిలో ఈ పరిణామం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం అవుతుందని చెప్పారని విలేకరులకు తెలిపారు.

తన రెండు రోజుల పర్యటన విజయవంతం అయిందని, తనను సిఎంగా కొనసాగాలని కేంద్ర నాయకులు కోరారని కూడా యడ్యూరప్ప వివరించారు. నాయకత్వ మార్పుపై ఎటువంటి చర్చ జరగదని తెలిపారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల జాబితాలో కర్నాటక కూడా ఉంది. దక్షిణాదిలో అధికారంలో ఉన్న కీలక రాష్ట్రాలలో కర్నాటక ఒక్కటి . శనివారం యడ్యూరప్ప అమిత్ షాను కలిశారు. ఒక్కరోజు క్రితం ఆయన ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. తాను రాజ్‌నాథ్ సింగ్, బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డాతో కూడా భేటీ అయినట్లు విలేకరులకు సిఎం చెప్పారు. కేవలం పార్టీని అన్నిస్థాయిలలో బలోపేతం చేసేందుకే చర్చలు జరిగినట్లు వివరించారు. తన సారథ్యంలోనే తిరిగి కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి వెళ్లిపోతుందని, ఇందులో ఎటువంటి సందేహం లేదని తెలిపారు. యుపి ఎంత ప్రాధాన్యత రాష్ట్రమో దక్షిణాదిలో కర్నాటక కూడా అంతే విలువైన రాష్ట్రం అని, బిజెపి ప్రాబల్యానికి కర్నాటక కీలకం కేంద్ర బిందువు అని నేతలు తనకు తెలిపారని యడ్యూరప్ప ఉత్సాహంగా ఇక్కడి కర్నాటక భవన్‌లో తెలిపారు.

26న బిజెపి లెజిస్టేటివ్ పార్టీ భేటీ
ఈ నెల 26న బిజెపి లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి కర్నాటక సిఎం యడ్యూరప్ప శనివారం పిలుపు నిచ్చారు. ఢిల్లీలో రెండు రోజుల పర్యటనను ముగించుకుని వచ్చిన వెంటనే శనివారం ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు. అయితే ఎందుకు ఈ భేటీ అనేది వివరించలేదు. తన ఢిల్లీ పర్యటన విజయవంతం అయినట్లు విలేకరులకు బెంగళూరులో తెలిపారు. పెద్దలు తననే కొనసాగమని చెప్పి పంపించారు. మరింతగా పార్టీ పటిష్టతకు పాటుపడుతానని తెలిపారు. నాయకత్వ మార్పు అంశం లేనే లేదని తాను ఢిల్లీలోనే ఈ విషయం చెప్పానని, ఇక్కడా ఇదే విషయం చెపుతున్నానని తేల్చివేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News