Wednesday, May 15, 2024

చైనాలో అగ్నిప్రమాదం: 31 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బీజింగ్: చైనాలోని యెంచౌన్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం 8.40 గంటలకు బార్బేక్యూ రెస్టారెంట్‌లో గ్యాస్ పేలడంతో 30 మంది దుర్మరణం చెందారు. ఏడుగురు గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ముస్లిమ్ నింగ్సియా అనే మతం వారు డ్రగెన్ బోట్ ఫెస్టివల్ జరుపుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. తాను రెస్టారెంట్‌కు 50 మీటర్లు దూరంలో ఉన్నప్పుడు భారీ శబ్ధంతో పేలుడు సంభవించిందని చెన్ అనే మహిళ తెలిపింది. ఫిబ్రవరి నెలలో మంగోలియాలో బొగ్గు గని కూలి 53 మంది మృతి చెందారు. గత నవంబర్‌లో చైనాలోని ఓ ట్రేడింగ్ కంపెనీలో అగ్రి ప్రమాదం జరగడంతో 38 మంది చనిపోయారు. 2015 తైంజిన్‌లో ఓ కెమికల్ వేర్‌హౌజ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో 173 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read: బచ్చన్నపేట ఎస్ఐ సస్పెండ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News