Wednesday, May 1, 2024

యువత 2022 వరకు వేచి చూడాల్సిందే

- Advertisement -
- Advertisement -

యువత 2022 వరకు వేచి చూడాల్సిందే
కరోనా వ్యాక్సిన్‌పై డబ్లుహెచ్‌ఓ చీఫ్ సైంటిస్టు సౌమ్యా స్వామినాథన్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ అంతానికి వ్యాక్సిన్ కోసం భారత్‌తో పాటుగా అన్ని దేశాలు ఎదురు చూస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లుహెచ్‌ఓ) కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు భారీ ఎత్తున జరుగుతు న్నప్పటికీ ఆరోగ్యవంతులైన యువత టీకాకోసం 2022 వరకు వేచి ఉండాల్సి వస్తుందని డబ్లుహెచ్‌ఓ అభిప్రాయపడుతోంది. ఎందుకంటే కరోనా ప్రమాదం ఎక్కువగా ఉన్న ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులకే తొలి ప్రాధాన్యత ఉంటుందని డబ్లుహెచ్‌ఓ చీఫ్ సైంటిస్టు సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరంగా ఉండే యువత 2022 వరకు వేచి ఉండాల్సి ఉంటుందన్నారు. వైరస్ వల్ల రిస్క్‌లో ఉండే హెల్త్ వర్కర్లకు ముందుగా వ్యాక్సిన్ అందుతుందన్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి అనేక మార్గదర్శకాలు రానున్నాయని, దీంతో ఆరోగ్యంగా ఉండే యువత 2022 వరకు ఎదురు చూడాల్సి ఉంటుందని ఆమె చెప్పారు.2021 నాటికి కనీసం ఒక్క వ్యాక్సిన్ అయినా వచ్చి తీరుతుందన్నారు.‘2021 జనవరి లేదా ఏప్రిల్ నాటికల్లా తనకు వ్యాక్సిన్ లభిస్తుందని, పరిస్థితి మామూలై పోతుందని జనాలు అనుకుంటూ ఉండవచ్చు. అయితే అలా జరగదు’ అని సౌమ్యా స్వామినాథన్ చెప్పారు.

ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా పలు రకాల టీకాలపై పరిశోధనలు శరవేగంగా జరుగుతున్నాయని, ముందుగా ఎవరికీ టీకా ఇవ్వాలనే విషయంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ముందుగా టీకా ఇవ్వాలని చాలా మంది అంగీకరిస్తున్నారని, అయినా ఆ వర్కర్లలో ఎవరికి ముందు టీకా ఇవ్వాలనే దానిపైన కూడా చర్చ జరుగు తోందన్నారు. ఆ తర్వాత వృద్ధులకు టీకా ఇవ్వడం జరుగుతుందన్నారు. టీకా చాలా తక్కువ మోతాదులో అందుబాటులో ఉంటుందన్నారు. ఇప్పటికే తమ ప్రజలకు టీకా ఇవ్వడం ప్రారంభించిన రష్యా, చైనాలు కూడా ఇదే ప్రాధాన్యతలను పాటిస్తున్నాయి.గత జూలైలో తమ సైన్యానికి టీకాలు ఇచ్చిన చైనా ఇప్పుడు, ప్రభుత్వ అధికారులకు, స్టోర్ స్టాఫ్‌తో పాటుగా హెల్త్‌కేర్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు కూడా వ్యాక్సిన్ ఇచ్చే విషయాన్ని అది ఆలోచిస్తోంది. కాగా, రష్యా ముందుగాఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్లతో పాటుగా జర్నలిస్టులకు వ్యాక్సిన్ ఇవ్వడంలో ప్రాధాన్యత ఇస్తోంది. మన దేశంలో కూడా ముందుగా ఏయే వర్గాలకు వ్యాక్సిన్‌ను ఇవ్వాలో నిర్ధారించేం దుకు ఒక హైలెవల్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Youth may have to wait for Vaccine till 2022: WHO

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News