Tuesday, May 14, 2024

మన్సూరాబాద్‌లో పలుపార్టీల యువకులు బిఆర్‌ఎస్‌లో చేరిక

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్: సోషల్ మీడియాలో భాజపా అసత్య ప్రచారాల చేస్తుందని వాటిని నమ్మకూడదని ఎల్బీనగర్ ఎంఎల్‌ఎ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ హిమపురి కాలనీలో యువజన నాయకులు జక్కడి రఘువీర్‌రెడ్డి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ నాయకులు భువనగిరి శశిధర నేత సారథ్యంలో పలు పార్టీల నాయకులు సుమారుగా 100 మంది యువకులు సుధీర్‌రెడ్డి అధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎల మాట్లాడుతూ భాజపా పార్టీ చేపడుతున్న బూటకపు ప్రచారాలు నమ్మోద్దని, కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అయిపోయిందని, బొమ్మలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారని విమర్శించారు.

సీఎం కేసిఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోవాలని, హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేసిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని దక్కిందన్నారు. ఆటోనగర్‌లో డంపింగ్ యార్డు ఉండడంతో సుమారు 20 కాలనీలలో దుర్గంధ పూరితమైన వాతావరణం నెలకొందని, అప్పటి కౌన్సిలర్, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డిలు కలిసి డంపింగ్ యార్డు ఎత్తివేయాలని పెద్దఎత్తున్న పోరాటం చేశామని గుర్తు చేశా రు. డంపింగ్ యార్డును నుంచి చెత్త తీసుకెళ్లి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పోయడం జరిగిందిని, దీంతో డంపింగ్ యార్డు ఇక్కడి నుంచి తరలించారని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో డంపింగ్ యార్డు ప్రాంతంలో పూల వనం ఏర్పాటు చేస్తామని, త్వరలో డంపింగ్ యార్డు ప్రాంతాన్ని అతి సుందరంగా పూల వనం ఏర్పాటు చేస్తామన్నారు.

పలు పార్టీల యువకులు బిఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీ అభివృద్ధికి యువకులు ముందుకు రావాలని సూ చించారు. పార్టీలో వినోద్, వెంకటసాయి, సాయి, కరుణకర్‌రెడ్డి, శివ, సుధీర్ , సురేష్, కిషోర్, శ్రీకాంత్, మహేష్ , మల్లికార్జున్, గోపిలు చేరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు జక్కడి మల్లారెడ్డి, ఈశ్వరమ్మ యాదవ్, మాజీ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు, జగదీష్ యాదవ్, ఎలుకొండ రాంకోఠి ,విజయ్‌భాస్కర్‌రెడ్డిలు పాల్గొన్నారు.

ఆర్టీసీ కాలనీ, శివగంగాకాలనీ, శ్రీనివాసకాలనీ, శివశంకర్ కాలనీ, శివమ్మనగర్, రాజీవ్ గాంధీనగర్ ఫేజ్ 1, 2, భరత్‌నగర్, అంబేద్కర్ నగర్, న్యూనాగోల్ , స్నేహపురి కాలనీల సంక్షేమ సంఘ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం కుషాల్ ఫంక్షన్‌హాల్‌లో డివిజన్ అధ్యక్షులు రాహుల్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హాజరై ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ నూతన డ్రైనేజీ నిర్మాణాలు చేపడతానని, తాగునీటి లోఫ్రెషర్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటానని తెలిపారు. తాగునీరు సమస్యలు లేకుండా జలమండలి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ సాగర్‌రెడ్డి, అనంతుల రాజిరెడ్డి, విశ్వేశ్వరరావు , మహేష్‌రెడ్డి , జోగు రాములు పాల్గొన్నారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News