Saturday, May 4, 2024

సమాజాభివృద్ధిలో యువత భాగస్వామ్యులవ్వాలి : డిజిపి అంజనీ కుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశ నిర్మాణంలో యువత గొప్ప పాత్ర పోషిస్తుందని, దేశం అభివృద్ధి, పురోగమనంతోపాటు సామాజిక సంస్కరణలను తీసుకురావడంలో యువతదే ప్రధాన పాత్ర అని డిజిపి అంజనీ కుమార్ అన్నారు. ‘అక్షయ విద్య స్వచ్చంద సంస్థ’ ఆధ్వర్యంలో శుక్రవారం డిజిపి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ నగరంలోని పలు బస్తీలకు చెందిన 80 మంది నిరుపేద విద్యార్థినీ, విద్యార్థులకు లాప్‌టాప్‌లను డిజిపి అందజేశారు.

ఐజి రమేష్ రెడ్డి, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా డిజిపి మాట్లాడుతూ, కష్టపడి చదువుకున్న యువత తమ బస్తీలలో ప్రాంతాల్లో చెడు మార్గాలలో పయనిస్తున్న తమ తోటి యువకులను గుర్తించి, వారిని సరైన రోజు మార్గంలో పయనించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి అంటే కేవలం పెద్ద, పెద్ద భవనాలు రావడం మాత్రమే కాదని, సమాజంలోని అట్టడుగు వర్గాలను అభివృద్ధి పథంలోకి తేవడం కూడా ప్రధానమని తెలిపారు. తాము మంచి ఉద్యోగాలు సాధించిన అనంతరం ఇతరులకు సహాయపడే గుణాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. ఒక దేశపు యువత దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని, ఇదే సమయంలో కొంతమంది యువత చెడు మార్గాలవైపు ఆకర్షితులవుతున్నారని, వారిని మార్చేందుకు చిత్త శుద్దితో ప్రయత్నించాలని యువతను కోరారు.

తెలంగాణ రాష్ట్రం దేశంలో 5వ అతిపెద్ద ఆర్థికాభివృద్దిని కలియున్న రాష్ట్రమని, కష్టపడి చదివితే ఐటి, ఫార్మా, మానవవనరుల రంగాల్లో అత్యధిక ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగమైనా, క్రీడా రంగమైనా ఏ ఇతర రంగాలైన పురోగమించాలంటే యువతదే కీలక పాత్ర అని అన్నారు. ఈ పాత్రను సరిగ్గా పోషించడంలో యువతకు సహాయం చేయడంలో స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న తోడ్పాటు ప్రశంసనీయమన్నారు. ఈ సందర్బంగా సింగరేణి కాలనీ, రసూల్ పురా తదితర బస్తీలకు చెందిన యువతీ, యువకులకు లాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. ఐఐటి ఖరగ్ పూర్‌లో సీట్ సాధించిన రమేష్ అనే యువకుడిని డిజిపి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద, హేమా ప్రతాప, అరుంధతి, జనార్దన్, మనోజ్ గుప్త, ప్రకాష్‌లు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News